బిగ్‌బాస్‌ విన్నర్‌ ఆదర్ష్‌..?

Adarsh Has Got more Chances Winning Bigg Boss Season

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 1 మరో రెండు రోజుల్లో పూర్తి కాబోతుంది. 16 మంది పార్టిసిపెంట్స్‌ ఇంట్లోకి వెళ్లగా 11 మంది బయటకు రాగా ప్రస్తుతం అయిదుగురు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆ అయిదు మందిలో ఒక్కరు ఈ వారాంతంలో విన్నర్‌గా నిలుస్తారు. ఎవరు విన్నర్‌ అనే విషయాన్ని ప్రేక్షకులు తమ ఓటింగ్‌ ద్వారా నిర్ణయిస్తారు అంటూ ఎన్టీఆర్‌ ఇప్పటికే ప్రకటించాడు. ఈ షో విన్నర్‌ అంటూ గత మూడు నాలుగు వారాలుగా హరితేజ లేదా శివబాలాజీ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా తాజాగా అందుతున్న ఓటింగ్‌ ట్రెండ్స్‌ను బట్టి చూస్తుంటే ఆదర్ష్‌ విన్నర్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్టార్‌ మాటీవీ నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం గురువారం వరకు ఆదర్ష్‌ ఓటింగ్‌ శాతం 34.5 ఉందని, శివబాలాజీకి ఓటింగ్‌ శాతం 33.2 ఉందట. వీరిద్దరు స్వల్ప తేడాతో టైటిల్‌ పోటీలో ఢీ కొడుతున్నారు. అర్చన చివరి స్థానంలో ఉండగా నవదీప్‌ నాల్గవ స్థానంలో ఉన్నాడు, హరితేజ మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సిందే. ఇంకా ఒకరోజు ఓటింగ్‌కు సమయం ఉంది కనుక ఖచ్చితంగా ఫలితం తారు మారు అయ్యేందుకు ఛాన్స్‌ ఉందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. కొందరు మాత్రం ఆదర్ష్‌ మృదు స్వభావం కారణంగా ప్రేక్షకులు ఆయన్ను విజేతగా చూడానుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి మరికొన్ని గంటల్లో తేలిపోయే విజయత ఎవరు అని తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు