మీసంతో దానం మొదలెట్టాడా ?

akkineni-nagarjuna-may-play-karna-in-mohanlals-rs-1000-crore-mahabharata

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఈ మధ్య హఠాత్తుగా మీసం లేకుండా దర్శనం ఇవ్వడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది. ఎన్ని విమర్శలు వచ్చినా అన్నమయ్య, శ్రీ రామదాసు వంటి చిత్రాల్లో చేసేటప్పుడు కూడా మీసాలతోనే యాక్ట్ చేసిన నాగ్ ఇలా మీసాలు తీయడం ఆశ్చర్యం కలిగించింది. ఆయన మీసాలు తీయడానికి కారణం కూడా ఓ సినిమా అని తెలుస్తోంది. నాగ్ తో ఈ పని చేయించిన ఆ సినిమా, ఆ దర్శకుడు, నిర్మాత ఎవరో ఆరా తీస్తే భలే విషయాలు బయటికి వచ్చాయి.

మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ భీముని పాత్రలో చేస్తుండగా మహాభారతాన్ని వెయ్యి కోట్ల భారీ వ్యయంతో తీస్తున్నారు. బి.ఆర్ . శెట్టి ఈ సినిమాకి నిర్మాత కాగా, శ్రీకుమార్ మీనన్ దర్శకుడు. ఈ సినిమాలో కర్ణుడి పాత్ర ఆఫర్ నాగ్ కి వచ్చిందట. ఆ పాత్రకి సంబంధించిన టెస్ట్ కోసమే నాగ్ మీసాలు తీసినట్టు చెప్పుకుంటున్నారు. కర్ణుడు అనగానే దాన గుణానికి మారుపేరు. ఆయన చివరకు పుట్టుకతో వచ్చిన కవచ కుండలాలను కూడా దానం ఇచ్చాడు. ఆ పాత్రలో ప్రవేశించడానికి నాగ్ కూడా ఎప్పుడు తీయని మీసంతో దానం మొదలు పెట్టాల్సి వచ్చింది అనుకుంటా.