డీజే హిట్‌.. ట్యూబ్‌లైట్‌ ఫట్‌

Allu Arjun Dj Movie Hit Salman Khan TubeLight Movie Fut

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Allu Arjun Dj Movie Hit Salman Khan TubeLight Movie Fut

బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా ఏ భాషలో అయినా శుక్రవారం వస్తుంది అంటే సినిమాలతో సందడే సందడి. ఇక నేడు శుక్రవారం సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రెండు ప్రముఖ చిత్రాలు వచ్చాయి. అందులో ఒకటి బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ట్యూబ్‌లైట్‌’కాగా, రెండవది టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘డీజే’. ఈ రెండు చిత్రాలపై కూడా ఆయా ఇండస్ట్రీ ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. దేశ వ్యాప్తంగా సల్మాన్‌ ఖాన్‌ ‘ట్యూబ్‌లైట్‌’ చిత్రంపై ఆసక్తి రేకెత్తేలా ప్రచారం చేశారు. ఇక ‘డీజే’ చిత్రం తెలుగులో భారీగా విడుదలైంది.

సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘ట్యూబ్‌లైట్‌’కు ప్రేక్షకుల నుండి నెగటివ్‌ టాక్‌ వస్తుంది. ఆశించిన స్థాయిలో సల్మాన్‌ మెప్పించలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సల్మాన్‌ గత చిత్రాలతో పోల్చితే ఇదో చెత్త సినిమాగా కొందరు ఫ్యాన్స్‌ స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. బాహుబలి రికార్డులు కాదు కదా, కనీసం ఒక మోస్తరు కలెక్షన్స్‌ కూడా ఈ సినిమా రాబట్టడం అసాధ్యం అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. ఇక మరో వైపు తెలుగులో ‘డీజే’ మాత్రం ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంది. అల్లు అర్జున్‌ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ను రాబట్టడంతో పాటు, భారీ వసూళ్లను రాబట్టడం ఖాయంగా చెబుతున్నారు. బాలీవుడ్‌లో విడుదలైన ‘ట్యూబ్‌టైల్‌’ వెలుగలేదు, తెలుగులో విడుదలైన ‘డీజే’ చిత్రం మోత మ్రోగింది.

మరిన్ని వార్తాలు:

ఆ పని చేస్తే సీఎం పదవి ఖాయమంటున్న రానా.

డీజే దుమ్ము రేపాడు – దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ రివ్యూ