‘డీజే’ గురించి ఫ్యాన్స్‌ ఏమంటున్నారంటే..!

Allu Arjun Fans Are Saying About Duvvada Jagannadham Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Allu Arjun Fans Are Saying About Duvvada Jagannadham Movie

‘రేసుగుర్రం’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘సరైనోడు’ ఇలా వరుస సక్సెస్‌లను దక్కించుకుంటూ వస్తున్న అల్లు అర్జున్‌ తాజాగా చేసిన చిత్రం ‘డీజే’. ఈ చిత్రంపై మొదటి నుండి కూడా మెగా ఫ్యాన్స్‌ అంచనాలు భారీగా పెట్టుకున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో బన్నీ సినిమా అనగానే సినీ వర్గాల్లో కూడా ఆసక్తి పెరిగింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కించాడు. దిల్‌రాజుకు నిర్మాతగా ఈ చిత్రం 25వ సినిమా అవ్వడంతో భారీగా ఖర్చు చేసి నిర్మించాడు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అల్లు అర్జున్‌ను ఎలాగైతే చూడాలని భావించామో అలాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ను దర్శకుడు హరీష్‌ శంకర్‌ చూపించాడు అంటూ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మణ యువకుడి పాత్రలో అల్లు అర్జున్‌ అనగానే కాస్త అనుమాన పడ్డామని, కాని సినిమాలో అల్లు అర్జున్‌ ఆ పాత్రను అద్బుతంగా పోషించి మెప్పించాడు అంటూ ఫ్యాన్స్‌ అంటున్నారు. స్టైలిష్‌ లుక్‌తో పాటు హీరోయిన్‌ పూజా హెగ్డేతో బన్నీ చేసిన రొమాన్స్‌ అదిరిపోయింది అంటున్నారు. పూజా హెగ్డే సినిమాకు మరింత గ్లామర్‌ అద్దిందని, తప్పకుండా ఈసినిమా 100 కోట్ల గ్రాస్‌ను రాబడుతుందని ఫ్యాన్స్‌ నమ్మకంతో ఉన్నారు. సాదారణ ప్రేక్షకులు కూడా సినిమా పట్ల పాజిటివ్‌గా కామెంట్స్‌ చేస్తున్నారు. కథ కాస్త కొత్తగా ఉండి, సెకండ్‌ హాఫ్‌పై మరింత శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తంగా ఫ్యాన్స్‌కు మాత్రం ‘డీజే’ వాయింపుడు నచ్చేసింది.

మరిన్ని వార్తాలు:

డీజే దుమ్ము రేపాడు – దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ రివ్యూ

ముగ్గురిలో ఒకరు కాదు.. ముగ్గురు!

ట్రైలర్‌ రివ్యూ : బాబోయ్‌.. ఇది తేజ సినిమానేనా?