మెగాస్టార్‌ మూవీలో మెగాస్టార్‌?

Amitabh Bachchan in Chiranjeevi 151 Movie Uyyalawada Narasimha Reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. ఈ నెల రెండవ వారంలో చిత్రం ప్రారంభంకు ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్స్‌ కనిపించబోతున్నట్లుగా మొదటి నుండి కూడా ప్రచారం జరుగుతుంది. తెలుగుతో పాటు కోలీవుడ్‌ మరియు బాలీవుడ్‌లో కూడా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నారు.

బాలీవుడ్‌లో చిరు 151వ చిత్రానికి భారీగా రాబట్టేందుకు అమితాబచ్చన్‌ను రంగంలోకి దించాలని ఫిక్స్‌ అయ్యారు. ఈ చిత్రంలో అమితాబచ్చన్‌ 10 నిమిషాల పాటు ఆన్‌ స్క్రీన్‌ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా కోసం 10 రోజుల పాటు అమితాబచ్చన్‌ డేట్స్‌ను కేటాయించాడనే ప్రచారం జరుగుతుంది. చిరంజీవిపై ఉన్న అభిమానంతోనే అమితాబ్‌ ఉయ్యాలవాడలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సురేందర్‌ రెడ్డి ఈచిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించబోతున్నాడు. నయనతారను హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ఇద్దరు స్టార్‌ హీరోయిన్స్‌ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నారు. ఈనెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యి వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి అమితాబచ్చన్‌ ఖచ్చితంగా అదనపు ఆకర్షణ కావాడం ఖాయం.

మరిన్ని వార్తలు

పవన్‌ సినిమాల పరిస్థితి ఏంటి?