‘భాగమతి’ మళ్లీ బ్యాడ్‌ న్యూస్‌..!

Anushka Bhagmati Movie release postponed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అనుష్క ప్రధాన పాత్రలో అశోక్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘భాగమతి’. ఈ చిత్రంలో అనుష్క ఐఏఎస్‌ పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇటీవలే అనుష్క పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన పోస్టర్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా కాలంగా ప్రేక్షకులను ఊరిస్తూ వస్తుంది. ఎట్టకేలకు సంక్రాంతికి ఖచ్చితంగా విడుదల చేస్తాం అంటూ ఇటీవలే నిర్మాతలు అనధికారికంగా మీడియాకు తెలియజేయడం జరిగింది. చిత్ర యూనిట్‌ సభ్యులు లీక్‌ చేయడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Anushka-Bhagmati-Movie-firs

సంక్రాంతికి భారీ పోటీ ఉన్నా కూడా అనుష్క సినిమాలో మ్యాటర్‌ ఉన్న కారణంగా విడుదల చేయబోతున్నట్లుగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో షాకింగ్‌ ప్రకటన యూవీ క్రియేషన్స్‌ నుండి వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుందని, అయితే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో సినిమాను సంక్రాంతికి విడుదల చేయలేమని తేల్చి చెప్పారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ లేదా మేలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్‌లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అనుష్క అభిమానులు మరియు సినీ వర్గాల వారు అంతా కూడా నీరుగారి పోయారు. గత ఆరు నెలలుగా ఈ సినిమా ఊరిస్తూనే ఉంది. ఈసారి అయినా వస్తుందని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. బాహుబలి తర్వాత అనుష్క చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.