జయ ప్రేమ నిజం…పెళ్లి కి శోభన్ వెనకడుగు.

Posted September 11, 2017 (2 weeks ago) at 15:59 

ramalakshmi says about jayalalitha and shoban babu love affair

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి చనిపోయినా ఆమె ఇంకా ఆ రాష్ట్ర ప్రజల గుండెల్లో అమ్మగా కొలువై వున్నారు. రాజకీయంగా ఆమె స్థానాన్ని భర్తీ చేసే స్థాయి వున్న నాయకుడు లేక ఇంకా తమిళనాడు అయోమయంలో కొట్టుకుంటూనే వుంది. అంతటి శక్తిసామర్ధ్యాలున్న జయలలిత ఒకప్పుడు సినీ నటుడు శోభన్ బాబు తో ప్రేమలో పడ్డారన్న వార్తలు ఎన్నో సార్లు బయటికి వచ్చాయి. అయితే అందులో నిజం ఏమిటో చెప్పడానికి ఎవరూ సాహసించడం లేదు. ఎవరైనా సాహసించి చెపుదామన్నా అప్పటి పరిస్థితి తెలిసిన వాళ్ళు పెద్దగా లేరు . అప్పట్లో శోభన్ బాబు, జయలలిత తో పరిచయం వున్న ఓ వ్యక్తి ఇప్పుడు వారి మధ్య ప్రేమ నిజం అని చెప్పారు. అలా చెప్పింది స్వర్గీయ ఆరుద్ర సతీమణి రామలక్ష్మి.

గోరింటాకు షూటింగ్ టైం సహా వివిధ సందర్భాల్లో శోభన్, జయలలితని దగ్గరగా చూసిన ఆమె కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. జయ మాట తీరు నడవడిక చూస్తే ఆమె శోభన్ ని గాఢంగా ప్రేమించిన విషయం అర్ధం అవుతుందని రామలక్ష్మి చెప్పారు. గోరింటాకు షూటింగ్ కూడా జయ ఇంటిలో జరిగిందని, అప్పుడు శోభన్ కి దగ్గరుండి వడ్డించడానికి అందరినీ భోజనానికి పిలిచేవారని కూడా చెప్పారు. శోభన్ కూడా ఆమెని ఇష్టపడ్డప్పటికీ అప్పటికే పెళ్లి చేసుకున్న భార్యకు అన్యాయం చేసే ఆలోచన తగదని పెళ్ళికి నో చెప్పారని రామలక్ష్మి అన్నారు.

మరిన్ని వార్తలు:

కిరణ్ కి కాంగ్రెస్… కాంగ్రెస్ కి కిరణ్ ?

బాబా పిచ్చి కేకల వెనుక సెక్స్ పైత్యం ?

ఎన్టీఆర్ ఎమోషన్ వెనుక పాలిటిక్స్?