జ్యోతిష శాస్త్రరీత్యా ఉన్న కారణం

Astrology Reasons About Guru Pournami

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

1. ఈ పూర్ణిమకు చంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటాడు. దాని అధిపతి బృహస్పతి దేవ గురువు.

2. ఈ రోజు సాధారణంగా ఉండే నక్షత్రం పూర్వాషాఢ. ఈ పూర్వాషాఢ నక్షత్ర అధిపతి శుక్రుడు, రాక్షస గురువు.

3. అలాగే దీని అర్థభాగమైన ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు, ధనుస్సు రాశికి భాగ్యస్థానాధిపతి, అంటే గురు స్థానం.

4. అంతే కాకుండా ధనుస్సు రాశి చక్రంలో తొమ్మిదవ రాశి, అంటే గురువు, గురు స్థానానికి కి కారక రాశి.

మనస్సుకు కారకుడైవ పూర్ణ చంద్రుడు ఇలా గురు స్థానంలో సంచరించే సమయంలో గురు ఆరాధన చేయటం వలన మనసు పూర్తిగా గురువుపై లగ్నమవటమే కాకుండా గురు అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అందుకే దీన్ని గురు పౌర్ణమి అంటారు.

ఈ గురు పౌర్ణమి రోజు మీ గురువులను శ్రద్ధాభక్తులతో ఆరాధించి గురు అనుగ్రహానికి పాత్రులుకండి.  గురు పరంపరలకు శత కోటి సహస్ర సాష్టాంగ నమస్కారములతో.

–శ్రీధర శర్మ