అమ్మాయిలను అడ్డుపెట్టుకుని నేను ఎదగలేదు…

Bandla Ganesh Comments On Nandi Awards

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
జూనియర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించి, పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన బండ్ల గణేష్‌ చివరకు బి గ్రేడ్‌ చిత్రాల్లో కూడా నటించాడు. అనుకోని అవకాశం అన్నట్లుగా బండ్ల గణేష్‌కు స్టార్‌ హీరోలతో ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ వంటి స్టార్‌ హీరోలతో సినిమాలు నిర్మించే అవకాశం దక్కింది. బండ్ల గణేష్‌ చేసినవి కొన్ని సినిమాలే అయినా కూడా మంచి పేరు సంపాదించాడు. అయితే అదే సమయంలో బండ్ల గణేష్‌ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటాడు. తాజాగా నంది అవార్డులను సైకిల్‌ అవార్డులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్‌పై కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

అమ్మాయిలను అడ్డం పెట్టుకుని, వారితో వ్యాపారం చేసి ఇప్పుడు నిర్మాతగా మారిన బండ్ల గణేష్‌ ప్రతిష్టాత్మక నంది అవార్డుల గురించి చులకనగా మాట్లాడటమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను అమ్మాయిలను అడ్డు పెట్టుకుని ఎదిగినట్లుగా వస్తున్న విమర్శలను కొట్టి పారేశాడు. తాను ఎప్పుడు కూడా అమ్మాయిలను అడ్డుపెట్టుకుని, వారి ద్వారా పైకి ఎదగలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అసలు అలాంటి పుకార్లకు, అలాంటి విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కష్టపడి నేను ఈ స్థాయికి వచ్చాను అని, తనకున్న పరిచయాల కారణంగా నిర్మాతగా అవకాశాలు వచ్చాయని చెప్పుకొచ్చాడు.