ప్రభాస్‌ ఇబ్బంది పడ్డాడు

bollywood heros are calls SIR to prabhas in Karan Johar party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్‌ రేంజ్‌ అమాంతం పెరిగి పోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ స్టార్‌ హీరోకు కూడా లేని గుర్తింపు బాలీవుడ్‌లో ప్రభాస్‌కు మాత్రమే ఉంది. బాలీవుడ్‌లో ప్రతి ఒక్క స్టార్‌కు కూడా ప్రభాస్‌ సుపరిచితుడు అయ్యాడు. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ ఇచ్చిన ఒక పార్టీకి రానా మరియు ప్రభాస్‌లు హాజరు అయ్యారు. ఆ సందర్బంగా పార్టీకి హాజరు అయిన బాలీవుడ్‌ ప్రముఖులు పలువురు ప్రభాస్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. ఆ సమయంలోనే ప్రభాస్‌ను సర్‌ అంటూ సంభోదించారట. 

ప్రభాస్‌ తనను అంతా కూడా డార్లింగ్‌ అంటూ సంబోధించాలని కోరుకుంటాడు. అలా కాకుంటే ప్రభా లేదా ప్రభాస్‌ అంటూ పిలవాలని భావిస్తాడు. కాని బాలీవుడ్‌ వారు మాత్రం ప్రభాస్‌ను సర్‌ సర్‌ అంటూ పిలవడంతో కాస్త ఇబ్బంది పడ్డాడు అని, అదే విషయాన్ని వారితో చెప్పాను అంటూ ప్రభాస్‌ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా చెప్పుకొచ్చాడు. తనకు సర్‌ అని పిలిపించుకోవడం ఇబ్బందిగా అనిపించిందని డార్లింగ్‌ ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు. కాస్త సిగ్గు ఎక్కువగా ఉండే ప్రభాస్‌ సర్‌ అనిపించుకోవడంకు ఇబ్బంది పడ్డాడట. ప్రస్తుతం ఈయన ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు.

మరిన్ని వార్తలు 

 ‘డీజే’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌

‘ఫిదా’ ట్రైలర్‌ రివ్యూ

ప్రభాస్‌కు షాక్‌ ఇచ్చిన జక్కన్న