మహేష్‌, బాలయ్య, బోయపాటి.. అద్బుతానికి ఆవిష్కారం

Boyapati To Direct Mahesh Babu-Balayya Babu Multistarrer Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో బోయపాటి ఒక సినిమా చేయాలని చాలా కాలంగా భావిస్తున్నాడు. అందుకోసం పలు సార్లు కలిసి కథ కూడా చెప్పాడు. మహేష్‌బాబు, బోయపాటిల కాంబినేషన్‌ ఎలా ఉంటుందో అని అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వీరిద్దరి కాంబో మూవీ బ్లాక్‌ బస్టర్‌గా నిలుస్తుందని ప్రారంభంకు ముందే ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు. మరో వైపు బాలయ్యతో మరో సినిమా చేసేందుకు కూడా బోయపాటి సిద్దం అవుతున్నాడని వార్తు వస్తున్నాయి. ‘జయ జానకి నాయక’ చిత్రం తర్వాత బాలయ్యతో ఒక సినిమా చేస్తాడని అంతా భావిస్తున్నారు. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ఒక షాకింగ్‌ కాంబోను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

తన వద్ద ఉన్న ఒక మాస్‌ మసాలా మల్టీస్టారర్‌ చిత్ర కథను మహేష్‌బాబు మరియు బాలకృష్ణకు బోయపాటి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ కథ బాలయ్యకు బాగా నచ్చిందని, అలాగే మహేష్‌బాబు కూడా ఆసక్తిని కనబర్చినట్లుగా తెలుస్తోంది. కథలో ఇంకా తన పాత్రపై క్లారిటీ తీసుకు రావాలని, తప్పకుండా సినిమా చేద్దాం అంటూ బోయపాటికి మహేష్‌బాబు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నేడో రేపో, లేదా మరెప్పుడైనా కూడా బాలయ్యతో మహేష్‌ బాబు స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం 100% ఖాయం అని తేలిపోయింది. వీరిద్దరిని ఎలా బ్యాలన్స్‌ చేసి బోయపాటి సినిమాను తెరకెక్కిస్తాడా అని ఇప్పటి నుండే ప్రేక్షకులు టెన్షన్‌తో ఎదురు చూస్తున్నారు.