లగడపాటిని బాబు ఎందుకు పిలిచారబ్బా ?

Chandrababu invites to Lagadapati Raja Gopal

Posted September 12, 2017 (2 weeks ago) at 15:57 

ఎక్కడ ఎన్నికలు ఫలితాల కన్నా ముందు లగడపాటి సర్వే ఫలితాలు కోసం అంతా ఎదురు చూస్తుంటాం. ఈ విషయంలో అధికార పక్షం అయినా, ప్రతిపక్షం అయినా పెద్దగా తేడా ఉండదు. అదీ ఎన్నికల తర్వాత సర్వేల నిర్వహణలో లగడపాటికి వున్న విశ్వసనీయత. అయితే ఇప్పుడు ఏ ఎన్నికలు జరగకపోయినా లగడపాటిని నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. ఈ సమావేశం ఎందుకు జరిగింది అని అడిగితే అసలు విషయం చెప్పకుండా సీఎం గారు పిలిచారు అందుకే వచ్చానంటూ అమరావతిలో విలేకరులని ఏమార్చే ప్రయత్నం చేశారు లగడపాటి.

లగడపాటి గతంలో కూడా అమరావతి వచ్చి సీఎం ని కలిశారు. ఇప్పుడు మరోసారి రావడంతో ఆయన టీడీపీ లో ఏమైనా చేరతారా అన్న సందేహాలు వస్తున్నా అలాంటి ఆలోచన ఏదీ లేదని ఆయన చెప్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో లగడపాటికి సీఎం ఆహ్వానం అందడం వెనుక ఇంకో కారణం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నంద్యాల, కాకినాడ విజయంతో వచ్చిన ఊపు కొనసాగించడానికి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు సీఎం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఓ సర్వే జరపమని అడిగేందుకే సీఎం లగడపాటిని పిలిచి ఉండొచ్చని కొందరి అంచనా. ఏదేమైనా ఊరక రారు మహానుభావులు అన్నట్టు లగడపాటి అమరావతి రాక హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని వార్తలు:

ఆ నంద్యాల పాఠం ఇక్కడ నల్గొండలో చెబుతారా ?

టీడీపీ లో కూడా ఓ పీకే… డబల్ ఫీజ్ కి డిమాండ్.

బ‌ల‌హీన‌ప‌డిన ఇర్మా… అయినా పొంచి ఉన్న ముప్పు