టీటీడీ ఛైర్మన్ గా కొత్త పేరు.

chandrababu propose to ttd chairman as Cm Ravi shankar

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీటీడీ ఛైర్మన్ గా ఇప్పటిదాకా ఎన్నో పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఎంపీలు రాయపాటి, మురళీమోహన్ లాంటి వాళ్ళు… గాలి ముద్దుకృష్ణమ నాయుడు లాంటి సీనియర్ నేతలు ఈ పోస్ట్ కోసం గట్టి ప్రయత్నాలే చేశారు. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి ఆ పోస్ట్ ఇచ్చే ఆలోచన లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పడంతో చాలావరకు ఫిల్టర్ అయ్యింది. ఓ దశలో ఈ పోస్ట్ కోసం నందమూరి హరికృష్ణ పేరు కూడా పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈ అంచనాలు అన్నిటికీ భిన్నమైన వ్యక్తిని టీటీడీ ఛైర్మన్ పోస్ట్ కోసం ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.

సీఎం రవిశంకర్ అనే వ్యక్తి టీటీడీ కొత్త ఛైర్మన్ గా నియమితులయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు లోని మదనపల్లి కి చెందిన రవిశంకర్ కి పారిశ్రామిక వేత్తగా, ఆధ్యాత్మిక వేత్తగా గుర్తింపు ఉందట. వివిధ సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని సీఎం ఈయన పేరుకి ఓకే చెప్పినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు:

ముద్రగడ బట్టలు సర్దుకోలేదట.

అమరావతి మీడియా ఏడవలేక నవ్వింది.

“ఉదయం “కోసం ముమ్మర ప్రయత్నాలు.