సమంతకు డబ్బింగ్‌ చెప్తూ ఏడ్చేసిన చిన్మయి..!

Chinmayi crying while dubbing to samantha for Raju Gari Gadhi 2

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నాగార్జున ప్రధాన పాత్రలో ఓంకార్‌ దర్శకత్వంలో ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగారి గది 2’. ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. సమంత ఈ చిత్రంలో దెయ్యంగా కనిపించబోతున్న విషయం తెల్సిందే. సమంత ఈ సినిమాలో కనిపించేది కొద్ది సమయమే కాని ఆమె పాత్ర సినిమాకు హైలైట్‌ ఉంటుందని చెబుతున్నారు. పగతో రగిలిపోయే ఆత్మగా సమంత కనిపిస్తుందని, ఆత్మ రూపంలో ఉన్నప్పుడు సమంత చెప్పే కొన్ని డైలాగ్స్‌ కన్నీరు పెట్టిస్తాయని తెలుస్తోంది. తాజాగా సమంత పోషించిన పాత్రకు చిన్మయి డబ్బింగ్‌ చెప్పింది. డబ్బింగ్‌ చెబుతున్న సమయంలో చిన్మయి కన్నీరు పెట్టుకుందట. 

చిన్మయి ట్విట్టర్‌ ద్వారా ‘రాజుగారి గది 2’ చిత్రంలోని సమంత పాత్రకు డబ్బింగ్‌ చెప్పాను అంటూ తెలియజేసింది. ఆ సమయంలో తాను ఎమోషన్‌ను ఆపుకోలేక పోయాను అని, సమంత నటనతో పాటు, అక్కడ సీన్స్‌ నాకు కన్నీరు తెప్పించాయని చిన్మయి చెప్పుకొచ్చింది. సినిమాలో కామెడీతో పాటు ఎమోషనల్‌ సీన్స్‌ కూడా ఉంటాయని చిన్మయి మాటల ద్వారా తెలుస్తోంది. తెలుగులో హర్రర్‌ కామెడీ సినిమాలకు మంచి మార్కెట్‌ ఉంది. అలాగే ఈ సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. మొదటి పార్ట్‌కు ఈ సినిమాకు అస్సలు సంబంధం లేదని, పూర్తిగా విభిన్న కథ అని ఓంకార్‌ చెబుతున్నాడు. ఇక ఇందులోని పాత్ర సమంతకు చాలా నచ్చిందని  అందుకే వెంటనే ఓకే చెప్పిందని సమాచారం. నాగార్జున ఈ చిత్రంలో భూత వైధ్యుడిగా నటించాడు. వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Chinmayi crying while dubbing to samantha for Raju Gari Gadhi 2