షూటింగ్‌లో పాల్గొంటున్న చిరంజీవి

chiranjeevi sye raa movie Test shoot Started

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

చిరంజీవి ‘ఖైదీ నెం.150’ చిత్రం షూటింగ్‌ ముగిసి సంవత్సరం అయ్యింది. ఆ సినిమా విడుదల అయ్యి కూడా సంవత్సరం కాబోతుంది. అయినా ఇప్పటి వరకు చిరంజీవి తన 151వ చిత్రం ప్రారంభించలేదు. ఆరు నెలల క్రితమే చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ అంటూ కన్ఫర్మ్‌ అయ్యింది. కాని ఏవో కారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యం చేస్తు వస్తున్నారు. తాజాగా షూటింగ్‌కు డేట్‌ను ప్రకటించిన విషయం తెల్సిందే. డిసెంబర్‌ మొదటి వారం నుండి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. అయితే అంతకు ముందే ఈ సినిమా కోసం చిరంజీవి చిత్రీకరణలో పాల్గొంటున్నాడు.

దాదాపు వారం రోజుల పాటు ఈ చిత్రీకరణ సాగుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అయితే ఇదో టెస్ట్‌ షూట్‌ అని, కేవలం మేకప్‌ ఎలా ఉంటుంది, పాత్ర తీరు ఎలా సాగుతుందనే విషయాలను తెలుసుకునేందుకు చిరంజీవి మరియు ముఖ్య తారాగణంపై చిత్రీకరణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ టెస్ట్‌ షూట్‌ సాగుతుండగా అల్లు అరవింద్‌ మరియు జెమిని కిరణ్‌లు పర్యవేక్షిస్తున్నారు. షూటింగ్‌కు ఇంకా చిరంజీవి లుక్‌ రెడీ కాలేదు. అయినా కూడా టెస్ట్‌ షూట్‌ చేసి ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలని దర్శకుడు భావించాడు. అందుకే రియల్‌ సెట్టింగ్‌లోనే ఈ టెస్ట్‌ షూట్‌ను చేస్తున్నారు.

త్వరగా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి వచ్చే దసరాకు సినిమాను విడుదల చేయాలని మెగా ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. కాని వచ్చే సంవత్సరంలో ఈ సినిమా విడుదల అనుమానమే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో అమితాబచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, జగపతిబాబులు నటిస్తున్నారు