సైరా నరసింహ రెడ్డి కి మళ్ళీ ఎదురుదెబ్బ…

Chiranjeevi Sye Raa Narasimha Reddy Movie Shooting details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభం అవ్వాల్సి ఉంది. గత ఏడు ఎనిమి నెలలుగా ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను అక్టోబర్‌లో ప్రారంభిస్తాం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం డిసెంబర్‌లో లేదా జనవరిలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటించబోతున్నారు. వారి డేట్లు కుదరకపోవడంతో పాటు, సినిమాటోగ్రఫర్‌కు వేరే ప్రాజెక్ట్‌లు ఉన్నందున ఈ ఆలస్యం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత సైరాపై దృష్టి పెట్టడం మంచిదని కూడా చరణ్‌ భావిస్తున్నాడు. ఆ కారణం వల్ల కూడా చిరు 151వ చిత్రాన్ని ఆలస్యం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను అధికారికంగా ప్రకటించి దాదాపు ఆరు నెలలు అవుతుంది. ఇప్పటి వరకు రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాకపోవడంతో ఫ్యాన్స్‌ కొంత అసహనంతో ఉన్నారు. చిరంజీవి 150వ చిత్రానికి కూడా ఫ్యాన్స్‌ ఇలాగే ఇరిటేట్‌ అయ్యారు. ఆ సినిమా రికార్డులు బ్రేక్‌ చేయడంతో ఫ్యాన్స్‌ హ్యాపీ అయ్యారు. ఇక ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి అంటే వచ్చే సంవత్సరం వరకు ఆగాల్సిందే. ఈ ఆలస్యం చూస్తుంటే వచ్చే సంవత్సరం దసరా వరకు సినిమా వచ్చేలా లేదనిపిస్తుంది.