మురళీమోహన్ సీట్ కి బడా కంట్రాక్టర్ ఎసరు.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
టీడీపీ ఎంపీ మురళీమోహన్ కి 2019 ఎన్నికల్లో రాజమండ్రి టికెట్ దొరుకుతుందా ?. కష్టమే అని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన తరపున మురళీమోహన్ కోడలు రూప అక్కడి వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి తాను తప్పుకుని కోడల్ని ఎన్నికల బరిలోకి దింపాలన్న మురళి మోహన్ ఆలోచన బయటికి వచ్చింది. అయితే మురళీమోహన్ అనుకున్నట్టు రాజమండ్రి ఎంపీ టికెట్ ఆయన కోడలికి సులువుగా దొరికే అవకాశం లేదని తెలుస్తోంది. మురళీమోహన్ ఆలోచనలకి భిన్నంగా హైకమాండ్ ఆలోచనలు సాగుతున్నట్టు సమాచారం. ఈసారి రాజమండ్రిలో పోటీకి మురళీమోహన్ ఒప్పుకోకపోతే ఆ స్థానం నుంచి బడా కాంట్రాక్టర్ ఒకరిని బరిలోకి దించాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్నారట.

Murali Mohan  daughter-in-law
బీఎస్సార్ పేరుతో బెంగుళూరు కేంద్రంగా బడా కాంట్రాక్టులు చేస్తున్న బలుసు శ్రీనివాసరావు ఎప్పటి నుంచో టీడీపీ అధినేత చంద్రబాబుకి దగ్గరగా వుంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఆర్ధికంగా కూడా బలుసు శ్రీనివాసరావు పార్టీకి అండదండలు అందించారు. అందుకు ప్రతిఫలంగా రాజధాని అమరావతి ప్రాంతంలో కొన్ని కాంట్రాక్టులు బీవస్సార్ పరం అయినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఆ బంధం అక్కడితో ఆగిపోవడం లేదట. రాజకీయంగా కూడా యాక్టివ్ కావాలని శ్రీనివాసరావు అనుకుంటున్నారట. అందుకు చంద్రబాబు ఆశీస్సులు కూడా తోడు అయ్యాయట. శ్రీనివాసరావు కోరుకున్నట్టు రాజమండ్రి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కూడా టీడీపీ అధిష్టానం కూడా ఆసక్తి చూపుతోంది. మొత్తానికి బలుసు రంగంలోకి దిగి మురళీమోహన్ సీట్ కి ఎర్త్ పెట్టినట్టే కనిపిస్తోంది.