దేశమంతా రావణ దహనం…ఆ గుడిలో మాత్రం ?

dasara-day-of-ravana-burning-does-not-open-the-doors-at-uttara-pradesh-temple

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దసరా పండగ వెనుక వున్న పౌరాణిక గాథల్లో అమ్మవారు మహిషుడనే రాక్షసుడిని చంపిన కధ ఒకటైతే, దశకంఠుడైన రావణుడిని రాముడు చంపిన రోజని ఇంకో కధ బహుళ ప్రచారంలో వుంది. అందుకే దసరా రోజు దేశమంతటా రావణ దహన కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ ఒకటిరెండు చోట్ల మాత్రం ఈరోజు రు. అదెక్కడో, ఏమిటో తెలుసుకుందాం.

రావణుడికి అక్కడ పూజలు జరుగుతాయి. అదేదో దక్షిణాదిన ఏ తమిళనాడులోనే అనుకుంటే పొరపడ్డట్టే. శ్రీ రాముడు పుట్టింది అయోధ్య అనుకుంటే ఆ పుణ్యస్థలి నెలకొన్న రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ లోనే ఇదంతా జరుగుతుంది. బందాయు లో రావణుడికి ఓ గుడి వుంది. అతి పురాతనమైన ఆ గుడిలో రావణుడికి నిత్య పూజలు జరుగుతాయి. ఆయన్ని ఓ మహావీరుడిగా, శివభక్తుడిగా కొలుస్తారు. కానీ రావణ దహనం జరిగే దసరా రోజు మాత్రం ఆ గుడి తలుపులు తెరుచుకోవు. అక్కడ ఏ పూజలు జరగవు. పైగా రావణ భక్తులు మౌనం పాటిస్తారు. రాముడు జన్మ స్థలం అనుకున్న ఉత్తరప్రదేశ్ లో ఈ సంప్రదాయం కాస్త చిత్రం గానే వుంది. అయితే అంతకు మించిన చిత్రం ఒకటి తాజాగా అదే రాష్ట్రంలో జరిగింది.

రావణాసురుడు బ్రాహ్మణ కులానికి చెందిన వాడు కావడంతో ఆయన బొమ్మల్ని ప్రతి ఏటా దహనం చేయడం ఆ వర్గానికి మనోవేదన కలిగిస్తోందని యూపీ కి చెందిన ఓ న్యాయవాది కోర్టుకి ఎక్కారు. రావణ దహన కార్యక్రమాల్ని నిలిపేలా ఆదేశాలు ఇవ్వాలని సదరు లాయర్ కోర్టుని కోరాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో వుంది. మొత్తానికి ఈ వ్యవహారాలు తప్పా,ఒప్పా అన్న తేలని చర్చ పక్కనబెడితే దేశంలో వున్న భిన్నత్వానికి అద్దం పడుతోంది.