భారతీయుడు 2 కి దిల్ రాజు బై?

Dil raju goodbye to Bharateeyudu 2 movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కథాబలం, కొత్త కొత్త దర్శకులు, మినిమం, మిడిల్ బడ్జెట్ సినిమాలకి పెట్టింది పేరు నిర్మాత దిల్ రాజు. ఆయన తన వెల దాటి వచ్చి సినిమాలు చేసిన దాఖలాలు లేవు. అయితే బాహుబలి తర్వాత ఆ స్థాయి సినిమాలు తీయాలన్న ఆలోచన అతనిలో పుట్టిన మాట నిజం. కాస్త జాగ్రత్తగా చేస్తే ఆ సినిమాల్లో కూడా భారీ లాభాలు తీసుకురావడానికి అవకాశం ఉందని తేలడంతో దిల్ రాజు కూడా పెద్ద సినిమాల మీద దృష్టి పెట్టారు. ఈ విషయం బయటి జనాలు గమనించే లోపే కమల్, శంకర్ కాంబినేషన్ లో భారతీయుడు 2 చేయబోతున్నట్టు అనౌన్స్ చేసి సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షాక్ లో పడేసాడు.

కమల్ , శంకర్ తో దిల్ రాజు సినిమా చేస్తున్నాడు అన్న షాక్ నుంచి కోలుకునే లోపే ఇంకో షాక్ కూడా తగిలేట్టు కనిపిస్తోంది. ఆ సినిమా నుంచి బయటికి రావడానికి దిల్ రాజు నిర్ణయం తీసుకున్నట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మాటలు. బడ్జెట్ విషయంలో శంకర్ చెప్పిన మాటలు బిజినెస్ పరంగా కమల్ తో వర్కౌట్ కాదని దిల్ రాజు భావించడమే అందుకు కారణం అంటున్నారు. ఇదే నిజం అయితే ఇది కూడా ఓ షాక్.