తెగే దాకా లాగితే.. ఇంతే

Dinakaran is better in Tamilnadu Governmnet

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ముందు చిన్నమ్మే పెద్దమ్మ అన్నారు. తర్వాత పన్నీర్ సెల్వంను తాత్కాలిక సీఎం చేశారు. ఆయన జయ సమాధి దగ్గరకు వెళ్లి అమ్మ చెప్పిందంటూ తిరుగుబాటు బావుటా ఎగరేశారు. తర్వాత పళనిస్వామిని తిట్టి ధర్మమే గెలుస్తుందని ప్రకటించారు. అంతలోనే బీజేపీ చెప్పిందని.. పళనిస్వామితో కలిసిపోయి డిప్యూటీసీఎం పదవి తీసుకుని తన స్థాయిని తానే తగ్గించుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో స్టాలిన్ లాభపడ్డారని కొందరు విశ్లేషకులు అప్పుడే చెప్పినా.. ఇప్పుడు సర్వే ఫలితాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి.

అన్నాడీఎంకేలో ఈపీఎస్, ఓపీఎస్ ఇద్దరిపైనా ప్రజలకు నమ్మకం పోయిందని తేలిపోయింది. గతంలో ఓపీఎస్ సీఎం కావాలని ఎక్కువమంది కోరుకున్నా.. ఇప్పుడు మాత్రం అలా భావించడం లేదు. ఇక సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ పై కూడా తమిళులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. వారికి అధికారం అప్పగించినా వారు మెయింటైన్ చేయలేరని, ఇప్పుడు అన్నాడీఎంకే సర్కారు లాగే చేస్తారని అనుకుంటున్నారు. అందుకే స్థిరమైన క్యాడర్ ఉన్న డీఎంకే లీడర్ స్టాలిన్ సీఎం అయితేనే బాగుంటుందని తమిళులు చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

ఈ సర్వే ఫలితాలు బయటకు రావడంతో.. అన్నాడీఎంకేలో గుబులు మొదలైంది. ఓపీఎస్, ఈపీఎస్ కంటే దినకరన్ బెటరని చాలా మంది చెప్పడం వారికి అస్సలు మింగుడు పడటం లేదు. స్టాలిన్ కు ఏకంగా నలభై శాతం మంది తమిళనాడు వాసులు మద్దతిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆయన సీఎం కావడం ఖాయమని సర్వే తేల్చింది. కానీ ఎన్నికల నాటికి పరిస్థితి మారచ్చని, ఇలాగే అయితే ఉండదని కొందరు వాదిస్తున్నారు. ఏం మారినా.. స్టాలిన్ ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడం బీజేపీకి కూడా సాధ్యం కాకపోవచ్చనేది సర్వే చెబుతున్న మాట.

మరిన్ని వార్తలు:

బాలుడి హ‌త్య‌ కేసుః నిందితుడి అరెస్ట్

సెప్టెంబ‌రు 9 స‌చిన్ కు ఎంతో ప్ర‌త్యేకం