ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ డౌటే.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రాముడు జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పటికే మూడు సినిమాలు పైప్ లైన్ లో వున్నాయి. ఇంకో సినిమా ప్రకటన త్వరలో ఉండొచ్చు అంటున్నారు. అంటే మొత్తం నాలుగు సినిమాలు ఎన్టీఆర్ మీద రాబోతున్నాయి. కానీ వీటిలో ఒక్కటి మిగిలిన సినిమాలు విడుదల అవ్వడం కష్టమే అట. లక్ష్మీస్ ఎన్టీఆర్ , లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాల మీద రగులుతున్న వివాదం చూసి ఈ మాట చెప్పడం లేదు. ఇలాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళుతున్నప్పుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకోవడం నైతికత. ఒకవేళ వారి అనుమతి లేకుండా రిలీజ్ చేద్దామని చూసినా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కోర్టుకి వెళితే మాత్రం చిక్కులు తప్పవు.

senior ntr

అదే పాయింట్ ని ఆధారంగా చేసుకుని బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్న దర్శకుడు తేజ మిగిలిన ఎన్టీఆర్ సినిమాల విడుదల కష్టమే అంటున్నారట. పైగా ఎన్టీఆర్ ఇమేజ్ ని దెబ్బ తీసేలా ఏదిబడితే అది సినిమా అంటే ఎలా అని ఆయన సన్నిహితుల దగ్గర అంటున్నారట. కానీ తేజ పాయింట్ ని ఆధారం చేసుకుని ఎన్టీఆర్ భార్యగా బాలయ్య చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కి లక్ష్మీపార్వతి అభ్యంతరం చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం లేకపోలేదు. అయితే బాలయ్య సినిమాని ఆపేంత ధైర్యం లక్ష్మీపార్వతి చేస్తారా అన్నది అనుమానమే. ఇప్పటికే ఆమె లక్ష్మీస్ వీరగ్రంధం సినిమా ప్రకటనతో అల్లాడిపోతున్నారు. ఆ సినిమా ముందుకు వెళ్లకుండా చూడగలిగితే రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆపడానికి కూడా లక్ష్మీపార్వతి ప్రయత్నించే అవకాశం వుంది. ఆమె సన్నిహితులు ఈ విషయాన్ని ధృవీకరించారు. లక్ష్మీస్ వీరగ్రంధం సినిమా ఆపితే బాలయ్య తీసే ఎన్టీఆర్ బయోపిక్ కి ఆమె ఏ ఇబ్బంది కలిగించకపోవచ్చు.