‘డీజే’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌

Duvvada jagannadham movie first day collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘డీజే’ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై మొదటి నుండి నెలకొన్న వివాదాలు మరియు సినిమా టీజర్‌, ట్రైలర్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో మరియు ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశానికి తాకేలా వచ్చాయి. దాంతో సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు దిల్‌రాజు తన శాయశక్తుల ప్రయత్నాలు చేశాడు. దాదాపు 1500లకు పైగా స్క్రీన్స్‌లలో విడుదల చేయడం జరిగింది. దాంతో బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ను ఈ చిత్రం అందుకుంది. 

ట్రేడ్‌ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘డీజే’ చిత్రం మొదటి రోజు 20 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు చేయడం ఖాయం అయ్యింది. ఇక మొదటి మూడు రోజుల్లో 65 కోట్లు వసూళ్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కలెక్షన్స్‌ పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది. సినిమాకు మిశ్రమ స్పందన వస్తుంది. ఫ్యాన్స్‌ సూపర్‌ అంటూ ఉంటే, ప్రేక్షకులు మాత్రం అంత లేదు, పర్వాలేదన్నట్లుగా ఉంది అంటున్నారు. మెగా ఫ్యాన్స్‌ ఈ సినిమాకు 100 కోట్ల గ్రాస్‌ను ఆశిస్తున్నారు. మరి ఆ స్థాయిలో కలెక్షన్స్‌ను ఈ చిత్రం రాబట్టగలదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

మరిన్నివార్తలు 

‘డీజే’ గురించి ఫ్యాన్స్‌ ఏమంటున్నారంటే..!

డీజే దుమ్ము రేపాడు – దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ రివ్యూ