క‌ల్బుర్గిని, గౌరీలంకేశ్ ను కాల్చింది ఒకే తుపాకితో

gauri-lankesh-mm-kalburgi-were-killed-by-same-pistol

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన క‌ర్నాట‌క జ‌ర్న‌లిస్టు గౌరీలంకేశ్ హ‌త్య కేసు లో కీల‌క ఆధారం ల‌భించింది. ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ ఆధారాన్ని అందించింది. రెండేళ్ల క్రితం క‌న్న‌డ స్కాల‌ర్ ఎంఎం క‌ల్బుర్గీని హ‌త్య చేసిన తుపాకితోనే ఇప్పుడు గౌరీని కూడా కాల్చిచంపిన‌ట్టు ఫోరెన్సిక్ ఆధారాలు ల‌భ్య‌మైన‌ట్టు తెలుస్తోంది. క‌ల్బుర్గీని 7.65 ఎంఎం కాలిబ‌ర్ స్వ‌దేశీ పిస్ట‌ల్ తో కాల్చిచంపారు.

గౌరీలంకేశ్ ను అదే తుపాకితో హ‌త్య చేశార‌ని, రెండు ఆయుధాల మ‌ధ్య 80శాతం సారూప్య‌త ఉంద‌ని ఫోరెన్సిక్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీనిపై ప్రాథ‌మిక నివేదిక‌ను గౌరీలంకేశ్ హ‌త్య‌కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సిట్ కు అందించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో క‌ల్బుర్గిని, గౌరీలంకేశ్ ను ఒకే ముఠాకు చెందిన వారు హ‌త‌మార్చి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టులే ఈ హ‌త్య చేసి ఉంటార‌ని భావిస్తున్నారు. గౌరీలంకేశ్ హ‌త్యతో దేశంలో పెద్ద ఎత్తున అల‌జ‌డి చెల‌రేగింది. హిందుత్వ‌ను వ్య‌తిరేకిస్తూ వార్త‌లు రాసే గౌరీలంకేశ్ ను ఆరెస్సెస్ వ‌ర్గాలు హ‌త‌మార్చాయ‌ని మేధావివ‌ర్గాలు, ప్ర‌జాసంఘాలు ఆరోపించాయి. కానీ కేసు ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులకు ల‌భిస్తున్న ఆధారాలు మావోయిస్టుల‌ను అనుమానించేట్టుగా ఉన్నాయి.

అయితే ప్రో న‌క్స‌లిజం వైఖ‌రితో ఉండే గౌరీలంకేశ్ ను చంపాల్సిన అవ‌స‌రం మావోయిస్టులకేముంది అని కొన్ని వ‌ర్గాలు ప్ర‌శ్నిస్తున్నాయి. ద‌ర్యాప్తు మ‌రికొన్ని రోజులు సాగితే త‌ప్ప దీనిపై ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం లేదు. సెప్టెంబ‌రు 5 గౌరీలంకేశ్ హ‌త్య జ‌రిగింది. గౌరి త‌న ఇంటిముందు నిల‌బ‌డి ఉండ‌గా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు బైక్ పై వ‌చ్చి అతి స‌మీపం నుంచి ఆమెపై కాల్పులు జ‌రిపారు. గౌరీ అక్క‌డికక్క‌డే మృతిచెందారు. త‌క్ష‌ణ‌మే స్పందించిన క‌ర్నాట‌క ప్ర‌భుత్వం కేసు ద‌ర్యాప్తును సిట్ కు అప్ప‌గించింది. వారం రోజుల‌కు పైగా చేసిన ద‌ర్యాప్తులో 80 మందిని విచారించిన సిట్ అధికారులు కీల‌క ఆధారాలు సేక‌రించారు.

మరిన్ని వార్తలు:

అవును…కాంగ్రెస్ ప్ర‌ధాని అభ్య‌ర్థిని నేనే

లగడపాటిని బాబు ఎందుకు పిలిచారబ్బా ?