గౌతమ్ నంద …తెలుగు బులెట్ ప్రివ్యూ.

gopichand gautham nanda Movie peview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సక్సెస్ కోసం మొహం వాచిపోయిన టాలీవుడ్ హీరో గోపి చంద్, దర్శకుడు సంపత్ నంది శ్రీబాలాజీ సినీ మీడియా పతాకం మీద కలిసి చేస్తున్న సినిమా గౌతమ్ నంద. సినిమా స్టిల్స్ చూస్తుంటే పక్కా కమర్షియల్ సినిమా అనిపిస్తోంది. కానీ దర్శకుడు సంపత్ నంది మాటలు వింటుంటే ఓ భిన్నమైన సినిమా చూడబోతున్నామన్న నమ్మకం కలిగిస్తోంది గౌతమ్ నంద.

‘ నేను ఎవరు’?. ఈ ప్రశ్న ఎవరిలో ఎక్కడ ఎప్పుడు ఉదయించినా ఓ పెను మార్పుకి అది సంకేతం అవుతుంది. నేడు ప్రపంచాన్ని ఏలుతున్న ఎన్నో మతాలు పుట్టింది ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకునేందుకు ఆయా వ్యక్తులు చేసిన అంతర్గత ప్రయాణం తోనే. ఇప్పుడు అదే ప్రశ్న ఓ కోటీశ్వరుడి బిడ్డకి ఎదురైతే అతనెలా స్పందించాడు ? అతనికి ఎక్కడ సమాధానం దొరికింది ? ఈ ప్రయాణంలో ఎదురైన సమస్యలేమిటి ? వాటికి కథానాయకుడు తెలుసుకున్న సమాధానం ఏమిటి అన్నదే గౌతమ్ నంద. పూర్తిగా తాత్వికత నిండిన ఈ అంశం చుట్టూ ఓ కమర్షియల్ కథ అల్లుకోవడం ఆషామాషీ విషయం కాదు. అయినా ఆ ప్రయత్నానికి పూనుకున్న సంపత్ నంది, దాన్ని నమ్మిన గోపీచంద్, వారిద్దరి మీద నమ్మకంతో భారీగా ఖర్చు పెట్టిన నిర్మాతలు…ఇలా అందరికీ గౌతమ్ నంద తీపి గుర్తులు మిగల్చాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ గౌతమ్ నంద.

మరిన్ని వార్తలు

టీడీపీ కి బలరాం గుడ్ బై ?

ముమైత్‌ ఆట పూర్తయ్యింది

ఆత్మహత్యకు ప్రయత్నం.. అందుకే బయటకు