వెరైటీగా గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైల‌ర్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Good Bad Ugly Theatrical Trailer

ప్ర‌ముఖ బుల్లితెర న‌టుడు,క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తొలిసారి డైరెక్ట్ చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ థియేట్రిక‌ల‌ర్ ట్రైల‌ర్ విడుద‌లైంది. వెరైటీ గా ఉన్న ఈ ట్రైల‌ర్ లో చాలా విష‌యాల‌ను చూపించాడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్. రాంగోపాల్ వ‌ర్మ క్యారెక్ట‌ర్ శివ సినిమా షూటింగ్ చేస్తోంటే..ఫ్రెండ్స్ తో క‌లిసి చూడ్డానికి వ‌చ్చిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ వర్మ‌ను విమ‌ర్శిస్తున్నాడు. హీరో ఫైటింగ్ చేయ‌కుండా వార్నింగ్ ఇచ్చేస్తే..రౌడీలు హీరోయిన్ ను వ‌దిలేస్తారా అని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప్ర‌శ్నించ‌డం, శివ‌తో పాటు గీతాంజ‌లి సినిమాను కూడా ఆయ‌న విమ‌ర్శించ‌డం చూసిన వ‌ర్మ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ను ఓ సినిమా డైరెక్ట్ చేయ‌మ‌ని ఆహ్వానిస్తాడు. త‌ర్వాత సినిమా డైరెక్ట‌ర్ అవ్వాల‌ని క‌ల‌లు కంటూఉన్న హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ను గ్రామ ప్ర‌జ‌లు ఎగ‌తాళి చేయ‌డం…ఒక్క సినిమా తీసి చూడ‌రా అని వారు వెట‌కారంగా వ్యాఖ్యానించిన అనంత‌రం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ యాక్ష‌న్ అన‌గానే…గుడ్ బ్యాడ్ అగ్లీ అస‌లు ట్రైల‌ర్ ను చూపించారు. మొత్తం ట్రైల‌ర్ 3.25 నిమిషాలు ఉండ‌గా…గుడ్ బ్యాడ్ అగ్లీ స‌న్నివేశాలు క‌నిపించే ట్రైల‌ర్ కు 1.15 నిమిషాలు మాత్ర‌మే కేటాయించారు.

మాస్ మసాలా సినిమాకు ఉండాల్సిన అన్ని ల‌క్ష‌ణాలూ గుడ్ బ్యాడ్ అగ్లీకి ఉన్న‌ట్టు ట్రైల‌ర్ చూస్తే అర్ధ‌మ‌వుతోంది. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ ఈ చిత్రానికి డైరెక్ష‌న్ చేయ‌డంతో పాటు ర‌చ‌న‌, సంగీతం కూడా అందిస్తున్నారు. అంజిరెడ్డి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై బొగాడి అంజిరెడ్డి నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీలో ప్ర‌ముఖ యాంక‌ర్ శ్రీముఖి, కిషోర్ కుమార్ న‌టిస్తున్నారు.డైరెక్ష‌న్, ర‌చ‌న‌, సంగీతం, న‌ట‌న ఇలా త‌న‌కున్న అన్ని టాలెంట్ల‌ను హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఈ సినిమా ద్వారా నిరూపించుకోవాల‌ని భావిస్తున్నారు. స‌రిగ్గా చెప్పాలంటే ఇది హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కెరీర్ ను తేల్చే సినిమా. చానాళ్ల నుంచి ఇండ‌స్ట్రీలో ఉంటున్నా….ఇప్ప‌టిదాకా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కు స‌రైన గుర్తింపు ల‌భించ‌లేదు. అందుకే త‌న బ‌హుముఖ ప్రావీణ్యాన్ని చాటుకోడానికి కీల‌క బాధ్య‌త‌ల్ని భుజాన వేసుకుని సినిమాను రూపొందించారు. ఇక హీరోయిన్ గా కెరీర్ మొద‌లుపెట్టి స‌రైన అవ‌కాశాలు లేక యాంక‌ర్ గా స్థిర‌ప‌డుతున్న శ్రీముఖి భ‌విత‌వ్యం కూడా ఈ సినిమాతో తేల‌నుంది. ట్రైల‌ర్ లో శ్రీముఖి చీర‌ల్లో క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ బాగానే ఎక్స్ పోజింగ్ చేసింది