జీ- మెయిల్ యూజర్స్ కి శుభవార్త..

mail

Posted [relativedate]

good news to gmail userప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది జీ-మెయిల్ ని వాడుతున్నారు. ఉద్యోగాలకు పెట్టుకునే అప్లికేషన్ల నుండి అఫీషియల్ నోటీఫికేషన్స్ వరకు జీ- మెయిల్ అటాచ్ మెంట్స్ ద్వారా పంపుతుంటారు. అయితే ఈ జీ- మెయిల్ ద్వారా 25 ఎంబీ కంటే ఎక్కువ సైజు ఉన్న ఫైల్స్ ని పంపడానికి వీలు పడదు. సో… ఖాతాదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇక నుండి అటువంటి ఇబ్బంది లేకుండా జీ- మెయిల్ ఖాతాదారులకు శుభవార్తను అందించింది గూగుల్.

జీ- మెయిల్ అటాచ్ మెంట్ సైజ్ ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఉన్న 25 ఎంబీ ని ఇప్పుడు 50ఎంబీ కి పెంచినట్లు ప్రకటించింది. అయితే పెద్ద సైజ్ ఫైల్స్ ని రిసీవ్ చేసుకోడానికి ‘డ్రైవ్’ అప్లికేషన్ ను వాడుకోవాలని సూచించింది. ఇది ఇప్పటికే జీ- మెయిల్ తో కలిసి పనిచేస్తోందని వివరించింది. ఫ్యూచర్ లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.