రవితేజ ఆలోచిస్తుండగానే గోపీచంద్‌ ఓకే చెప్పేశాడు…

Gopichand replaces to ravi teja robin hood movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మాస్‌ రాజా రవితేజ హీరోగా చక్రి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్‌’ అనే టైటిల్‌తో ఒక సినిమా తెరకెక్కబోతుందని కొన్ని నెలల క్రితం అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. రవితేజకు రాబిన్‌హుడ్‌ పాత్ర చాలా బాగా సూట్‌ అవుతుందని, తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంను రవితేజ ఫ్యాన్స్‌ వ్యక్తం చేశారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత రవితేజ ‘రాబిన్‌హుడ్‌’ చిత్రాన్ని చేస్తాడని సినీ వర్గాల వారు కూడా భావించారు. కాని ఏం జరిగిందో ఏమో కాని రవితేజ నుండి ‘రాబిన్‌హుడ్‌’ ప్రాజెక్ట్‌ గోపీచంద్‌కు వెళ్లి పోయింది.

Gopichand replaces to ravi teja robin hood movie

గోపీచంద్‌ హీరోగా చక్రి దర్శకత్వంలో ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రాన్ని నిర్మించిన రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభోత్సవంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామానాయుడు స్టూడియోలో షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్లుగా నిర్మాత అధికారికంగా ప్రకటించాడు. రవితేజ కథలో మార్పులు చెప్పడంతో పాటు పారితోషికం ఎక్కువ అడగడం వల్ల సినిమా చేతులు మారినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ను దర్శకుడు చక్రి పూర్తి చేసే పనిలో ఉన్నాడు. గోపీచంద్‌ సక్సెస్‌ కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా ఆయనకు మంచి ఫలితాన్ని ఇస్తుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. ఈ చిత్రంలో గోపీచంద్‌కు జోడీగా లక్కీ బ్యూటీ మెహ్రీన్‌ హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.