టీజర్‌ రివ్యూ : ‘హలో’ అఖిల్‌ సాహసాలు అదుర్స్‌

Hello teaser review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన హలో చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. మొదటి సినిమా పూర్తి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా చేసిన అఖిల్‌ రెండవ సినిమాలో ప్రేమ కథతో అలరిస్తాడని అంతా భావించారు. విక్రమ్‌ కుమార్‌ గతంలో తెరకెక్కించిన ‘ఇష్క్‌’ తరహాలో ఉంటుందని ఆశించారు. కాని ఇదో పెద్ద అడ్వంచర్‌ చిత్రం అని టీజర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

Hello-movie-Teaser

అఖిల్‌ పలు సాహసాలు చేసినట్లుగా టీజర్‌లో కనిపిస్తుంది. ఇక సినిమాలో ఇంకెంతగా సాహసాలు చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. సహజంగా అయితే స్టార్‌ హీరోల టీజర్‌లో కేవలం హీరోను మాత్రమే చూపిస్తారు. కాని ఈ టీజర్‌లో మాత్రం హీరోయిన్‌ను కూడా చూపించారు. అంటే సినిమాలో హీరోయిన్‌ పాత్ర చాలా ముఖ్యం అని చెప్పకనే చెబుతున్నారు. ఇక టీజర్‌ను బట్టి అర్థం అయిన విషయం ఏంటీ అంటే ఈ చిత్రంలో హీరో హీరోయిన్‌ చిన్ననాటి స్నేహితులు. ఏదో కారణం వల్ల చిన్నప్పుడే విడిపోతారు. పెద్దయ్యాక వారు ఎలా కలిశారు, వారి ప్రేమ కథలో విన్‌ ఎవరు, సినిమాలో అఖిల్‌ పాత్ర ఏంటీ అనే విషయాలు సినిమా విడుదలైతే క్లారిటీ వస్తుంది.