ఏపీలో హైకోర్టుకు చాలా టైముంది

central-government-reveals-time-for-high-court-building-in-ap

ఏపీలో హైకోర్టుకు చాలా టైముంది (High Court Setup Will Take Time In AP By Central Government)

 

Posted ఆగస్ట్ 12, 2017 (2 weeks ago) at 11:57 

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రం మరో షాకిచ్చింది. ఏపీలో హైకోర్టు ఏర్పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందని, అదిప్పుడప్పుడే సాధ్యం కాదని తేల్చేసింది. అమరావతిలో ఇంకా శాశ్వత భవనాల నిర్మాణం మొదలే కాలేదని, ఆ నిర్మాణాలు ప్రారంభమైతే హైదరాబాద్ హైకోర్టును సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నిర్మిస్తుందని తేల్చేసింది కేంద్రం.
పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఈ మాట చెప్పడంతో.. టీఆర్ఎస్ ఎంపీల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఇప్పటికే హైకోర్టులో ఆంధ్రా పెత్తనం నడుస్తోందని గోల చేస్తున్న గులాబీ నేతలకు ఇప్పుడు దిక్కుతోచటం లేదు. చంద్రబాబు తీరు చూస్తుంటే విభజన చట్టం లెక్క ప్రకారం పదేళ్లు హైకోర్టు ఇక్కడే కొనసాగించేలా ఉన్నారని వారు మథనపడుతున్నారు.
కోర్టు భవనాలు, న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది నివాస భవానాలు అన్నీ రెడీ అయ్యాక హైకోర్టు ఏపీకి తరలుతుందని, అప్పటిదాకా తొందరేమీ లేదన్న కేంద్రం మాటలు టీఆర్ఎస్ కు అశనిపాతమయ్యాయి. ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిదని భావిస్తుంటే ఈ పితలాటకం ఏంటని కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారట. అన్ని భవనాలు కడుతున్న చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా హైకోర్టును పట్టించుకోవడం లేదనే భావన కూడా కేసీఆర్ కు ఉంది.

మరిన్ని వార్తలు: