‘హౌరాబ్రిడ్జ్‌’ కి ఇవి  హైలైట్స్‌

Highlights of Howrah Bridge Movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రస్తుతం యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి దక్కుతుంది. ముఖ్యంగా యూత్‌ ఆడియన్స్‌ను టార్గెట్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తే ఖచ్చితంగా సక్సెస్‌ గ్యారెంటీ. యూత్‌ను ఆకట్టుకునే విధంగా చక్కని టైటిల్‌తో రాహుల్‌ రవీంద్రన్‌ మరియు చాందిని చౌదరి జంటగా రేవన్‌ యాదు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హౌరా బ్రిడ్జ్‌’. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్స్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. మొదటి టీజర్‌ రొమాంటిక్‌ ఎలిమెంట్స్‌తో యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకోగా, రెండవ టీజర్‌ యూత్‌ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ఆకట్టుకుంది. రెండు టీజర్‌ల తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. 

ఈ చిత్రంలోని హైలైట్స్‌ గురించి చిత్ర యూనిట్‌ సభ్యులు మాట్లాడుతూ.. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుందని, హీరో హీరోయిన్‌ మద్య ప్రేమ సీన్స్‌ చాలా సహజంగా ఉండి యూత్‌ను కట్టి పడేస్తాయి. ప్రతి యువతి యువకుడు కూడా తమ జీవితంలో లేదా తమ స్నేహితుల జీవితంలో ఈ కథ జరిగిందా అన్నట్లుగా ఫీల్‌ అవుతారు. రావు రమేష్‌ మరియు అజయ్‌ల నటన కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు. ఈ చిత్రంతో రాహుల్‌ రవీంద్రన్‌తో పాటు హీరోయిన్‌ ఛాందిని చౌదరిలకు బ్రేక్‌ వస్తుందని చెబుతున్నారు. రాహుల్‌ రవీంద్రన్‌ కూడా ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నాడు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు మండవ నాగేశ్వరరావు, వడ్డేపల్లి శ్రీనివాసరావులు పేర్కొన్నారు.