బుద్ధి మార్చుకోని చైనా

home-minister-rajnath-singh-warns-china

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మొదట దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక స్థావరం కోసం చూశారు. తర్వాత ముత్యాల సరాలు, సిల్క్ రూట్ పేరుతో ఇండియాను దిగ్భంధం చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకున్న పని వర్కవుట్ కాలేదు. ఇంకేముందు మన దాయాదిని దువ్వి, పాకిస్థాన్లో కారిడార్ నిర్మించేస్తున్నారు. దీనికి తోడు డోక్లాంలో ముందుకొచ్చి రెచ్చగొట్టారు. అక్కడ గొడవ సద్దుమణగకముందే లడఖ్ లో రాళ్లదాడికి దిగారు.

చైనా చర్యలు రోజురోజుకీ దుందుడుకుగా మారుతున్నా.. మన హోం మంత్రి రాజ్ నాథ్ మాత్రం సంయమన మంత్రాన్నే పఠించారు. చరిత్రలో ఎప్పుడూ భారత్ ఇతర దేశాలపైకి దండెత్తలేదని, అలాగని మా భూభాగం జోలికొసతే సహించమని వార్నింగ్ ఇచ్చారు. అటు చైనా మాత్రం కవ్వింపులు ఆపడం లేదు. భారత్ ను కించపరుస్తూ వీడియోలు పోస్ట్ చేసిన చైనా.. ఇప్పుడు భారీ యుద్ధ విన్యాసాలకు తెరతీసింది.

జపాన్ ఏకపక్షంగా భారత్ కు మద్దతు పలకడంతో… అమెరికా కూడా మనకే మద్దతిచ్చే అవకాశం ఉంది. మిత్రదేశమైన రష్యా తటస్థంగా ఉంటే చైనాను ఓ ఆట ఆడుకోవచ్చు. కానీ చైనా యుద్ధాన్ని వద్దనుకుంటోంది ప్రపంచం. యుద్ధం వస్తే మనకంటే డ్రాగన్ కే ఎక్కువ నష్టం. అందుకే ఆచితూచి అడుగులేస్తోంది. కానీ భారత్ ఇంకా బలహీనదేశమనుకుంటున్న చైనాకు బుద్ధి రావాలంటే ఏదో రకంగా గుణపాఠం చెప్పాల్సిందే.

మరిన్ని వార్తలు:

గుండు కొట్టించుకునేదెవరు..?