ప్రేమతో “హౌరా బ్రిడ్జ్ ” కట్టేశారుగా…

Howrah Bridge Telugu Movie Teaser 2

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఔను మీరు పైన చూసిన హెడ్డింగ్ నిజంగా నిజం అని ఒప్పేసుకుంటారు. అప్పుడే మొదలైందా ఈడు మరీ ఎక్కువ చేస్తున్నాడు , చెప్పేస్తున్నాడు అని. సహజమేగా… నడుస్తున్న కాలం అలాంటిది. కానీ ఆ సినిమా టీజర్ చూసాక కాస్త ఎక్కువే చెప్పాలి అనిపించింది. కాలంలో ఎన్ని మార్పులు వచ్చినా రోజుకి 24 గంటలే. గంటకి 60 నిమిషాలే. నిమిషానికి 60 క్షణాలే. ఇది ఎలా ఫిక్స్ అయిపోయిందో అలాగే కాలం ఎంత మారినా భావోద్వేగాలు అంతే. ఆ ఎమోషన్స్ లో దేని గురించి అయినా వర్ణించగలం. ఒక్క ప్రేమ విషయంలో తప్ప. ప్రేమని కూడా భావోద్వేగాల లిస్ట్ లో కలిపి చిన్న విషయంగా మార్చేశారు అనుకుంటున్నారా ?. కానీ సైన్స్ చెప్పేది అదే. ఏ భావం, ఏ ఉద్వేగం ముంచెత్తినా దాన్ని ఎమోషన్ అనే అంటుంది . ఆ ఎమోషన్ ఏంటనేది మనలో రసాయనిక మార్పుల్ని బట్టి అది గుర్తిస్తుంది. ప్రేమని కూడా అంతే అనుకున్న సైన్స్ కూడా బొక్క బోర్లా పడింది. ప్రేమలో పడ్డ మనిషిలో కలిగే మార్పుల్ని చెప్పగలిగింది కానీ ప్రేమలో ఎవరు ఎందుకు పడతారో చెప్పలేకపోయింది.

గుప్పెడంత గుండెల్లో కలిగే ఆ ప్రేమని ఒడిసిపడదామని వెండితెర ఎన్నో ప్రయత్నాలు చేసింది. ప్రేక్షకులకి అమర కావ్యాలు చూపింది. ఆ కోవలో ఈ మధ్య కుర్రకారు ఏమి సినిమాలు చేస్తుందిలే అనుకుంటున్నారా ? . ఆ డౌట్ వున్న వారికి ఓ చిన్న సలహా.” హౌరా బ్రిడ్జ్ ” టీజర్ చూసెయ్యండి. ఈరోజుల్లోనూ ప్రేమని ఇంత సున్నితంగా చెప్పొచ్చా అనిపిస్తుంది. గాలిలో తేలినట్టు కాదు ఓలలాడినట్టు అనిపిస్తుంది. పేరు చూస్తే” హౌరా బ్రిడ్జ్ ” అనుకుంటే కాస్త సున్నితత్వం, ఇంకాస్త రసజ్ఞత, చిటికెడు చిరునవ్వు కలిపేసి ప్రేమవారధిగా హౌరా బ్రిడ్జ్ కట్టేశారు. బూచాడమ్మా బూచోడు సినిమాతో తన మార్క్ చూపించిన రేవన్ యాదు దర్శకత్వ లోని ఇంకో కోణాన్ని చూపించే సినిమా ఇది అని టీజర్ తోనే తేలిపోయింది. ఇక మండవ నాగేశ్వరరావు, వడ్డేపల్లి శ్రీనివాసరావు నిర్మాతలుగా ఎంత మంచి ప్రయత్నం చేశారో ఈ టీజర్ చూస్తే చాలు. మంచి సినిమాలు రావు, రావు అనుకునే వారికి సవాల్ విసురుతున్న “హౌరా బ్రిడ్జ్ ” గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుందాం.