ఏపీలో ముచ్చటగా మూడో ఎన్నిక

in-the-ap-third-election-is-visakha-corporation-election

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

మొన్నటిదాకా నంద్యాల ఎన్నికలతో హైఓల్డేజ్ పొలిటికల్ హీట్ క్రియేట్ చేసిన నేతలు.. ఇప్పుడు కాకినాడ కార్పొరేషన్ తో కుస్తీ పడుతున్నారు. ఈ ఎన్నిక కూడా అయిపోతే ఇక ఏడాదిన్నర వరకు ఎన్నికల్లేవనుకుంటున్నారు. కానీ ఏపీలో ముచ్చటగా మూడో ఎన్నిక ముంచుకొస్తోంది. అదే విశాఖ కార్పొరేషన్ ఎన్నిక. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖలో గెలుపు ఇంకా కీలకంగా మారింది.

ప్రస్తుతం 82 వార్డులుగా కార్పొరేషన్ ను విభజిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. ఇక రిజర్వేషన్ల లెక్క తేలితే ఇక ఎన్నికలకు మార్గం సుగమమైనట్లే. ఈలోగా వార్డుల పట్ల ఎవరికైనా అభ్యంతరాలున్నా జీవీఎంసీకి రిపోర్ట్ చేయొచ్చు. ఇవి అన్నీ పరిశీలించి ఒకట్రెండు నెలల్లో ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తారు. అది రాగానే ఎన్నికలు షురూ అయినట్లే.

గత ఎన్నికల్లో విశాఖలో విజయమ్మ ఓడిపోవడం జగన్ కు షాకిచ్చింది. అందుకే ఉత్తరాంధ్రపై కొంతకాలంగా ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీంతో ఇప్పుడు విశాఖలో నెగ్గితీరాలని లోకల్ లీడర్లకు జగన్ స్పష్టం చేశారట. ఈ ఎన్నికల్లో గెలుపే రేపు అధికార పీఠానికి మలుపు అని చెబుతున్నారట. కానీ టీడీపీ మాత్రం కొండంత ఆశతో ఉంది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేదు. పైగా విభజన తర్వాత చాలా ఐటీ కంపెనీలు విశాఖకు రావడంలో బాబు పాత్ర ఉంది. దీంతో టీడీపీకి నల్లేరుపై నడకే అంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని వార్తలు:

అమెరికా వ‌దిలి నీ దేశం వెళ్లిపో..

టీ 10 క్రికెట్లోకి సెహ్వాగ్