మ‌రో రికార్డు సృష్టించిన కోహ్లీ

India-captain-Virat-Kohli-E

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భార‌త్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల పరంప‌ర కొన‌సాగుతోంది. ఛేజ్ మాస్ట‌ర్ అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్ లో 50 సెంచ‌రీలు పూర్తిచేశాడు. ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంక తో డ్రాగా ముగిసిన తొలి టెస్టులో కోహ్లీ సాధించిన సెంచ‌రీకి మ‌రో ఘ‌న‌త కూడా ఉంది. కెప్టెన్ హోదాలో 11 సెంచ‌రీలు చేసిన కోహ్లీ గ‌తంలో సునీల్ గ‌వాస్క‌ర్ నెల‌కొల్పిన రికార్డును స‌మం చేశాడు. 2014లో ధోనీ నుంచి టెస్ట్ కెప్టెన్సీ ప‌గ్గాలు అందుకున్న కోహ్లీ..మూడేళ్ల‌లో ప‌ద‌కొండు శ‌త‌కాలు న‌మోదు చేశాడు. భార‌త్ త‌ర‌పున స‌న్నీ, కోహ్లీ టెస్టుల్లో కెప్టెన్ గా 11 సెంచ‌రీలు చేయ‌గా…అజారుద్దీన్ తొమ్మిది శ‌త‌కాలు చేశారు.

కాగా.. వెలుతురు లేమి కార‌ణంగా గెలుపు ముంగిట‌ టెస్టు డ్రా గా ముగియ‌డంతో భార‌త అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో 172 ప‌రుగుల‌కే ఆల‌వుట్ అయిన భార‌త్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చెల‌రేగి ఆడింది. కెప్టెన్ కోహ్లీ అద్వితీయ అజేయ శ‌త‌కం పూర్తికాగానే 352 ప‌రుగుల వ‌ద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా 231 ప‌రుగుల ఆధిక్యం సాధించింది. భారీ స్కోరు చేయాల్సి ఉండ‌డంతో శ్రీలంక‌పై ఒత్తిడి పెరిగింది. వెంట‌వెంట‌నే వికెట్లు కోల్పోయింది. దీంతో అంద‌రూ భార‌త్ విజ‌యం ఖాయ‌మ‌నుకున్నారు. కానీ వెలుతురు స‌రిపోక‌పోవ‌డంతో ఇంకా ఓవ‌ర్లు మిగిలిఉన్న‌ప్ప‌టికీ..26.3 ఓవ‌ర్ల‌కే మ్యాచ్ నిలిపివేస్తున్న‌ట్టు అంపైర్లు ప్ర‌క‌టించి శ్రీలంక‌ను ప‌రాజయం నుంచి గ‌ట్టెక్కించారు.