కడప ఎంపీకి జగన్ షాక్… కారణం వింటే నవ్విపోతారు.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఒక టైం లో మంచి అయ్యింది ,ఇంకో టైం లో కాకపోవచ్చు. అన్నీ కాలానికి లోబడే ఉంటాయి. అయితే ఆ కాలం లోతు కొలవడానికి, బాగా బతికితే ఓ 70 , 80 ఏళ్ళు వుండే మనకి అర్ధం కాదు. అయితే కాలంతో పాటు వచ్చే మార్పుల్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మరీ చూపిస్తున్నాడు వైసీపీ అధినేత జగన్. తమ్ముడు అవినాష్ కడప ఎంపీ గా పనికిరాడని జగన్ ఫీల్ అవుతున్నాడంట. ఇందుకు కారణం చెబితే నవ్వి పోతారు. అంతకన్నా ముందు అంతా కాల మహిమ అంటూ వైరాగ్యం ప్రదర్శిస్తారు.

వై.ఎస్ తమ్ముడు భాస్కర్ రెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డి. యూ.కె లో ఎంబీఏ చేసి వచ్చాడు. 2009 నుంచి కడప జిల్లాలో పెదనాన్న చాటు బిడ్డగా ఉంటూనే ఆయన అప్పగించిన రాజకీయ పనులు సమర్ధంగా పూర్తి చేసాడు. అన్న జగన్ 2009 లో కడప ఎంపీ గా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక జగన్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చాక వైసీపీ ఆవిర్భావం సమయంలో అన్నకి అన్ని విధాలుగా తోడుగా వున్నాడు. ఆయన పని తీరు నచ్చి జగన్ 2014 ఎన్నికలకు చాలా ముందే అవినాష్ కడప ఎంపీ అభ్యర్థి అని ప్రకటించాడు. చెల్లి షర్మిల అడిగినా ఆ సీట్ అవినాష్ కే నని తేల్చి చెప్పాడు. అంతగా జగన్ ని మెప్పించిన అవినాష్ ఇప్పుడు అన్నకి ఎందుకు నచ్చడం లేదో తెలుసా ?

నాటి వై.ఎస్ రాజారెడ్డి మొదలుకుని ఇప్పటి జగన్ దాకా ఆ కుటుంబం దూకుడుకి పెట్టింది పేరు. కానీ అదే కుటుంబం నుంచి వచ్చినా అవినాష్ చాలా సాఫ్ట్. విదేశాల్లో చదవడం వల్లో, ఇంకేదైనా కారణమో గానీ అవినాష్ మాటలో కరుకుదనం ఉండదు. ఎవరినైనా మర్యాదగా పలకరిస్తారు. ఎంపీ ని అన్న అహం ఆయన మాటల్లో కనిపించదు. ఓ ఎస్సై ని కూడా సార్ అని మర్యాదగా పిలిచేంత సాధుస్వభావి. దీని వల్ల జనం,వైసీపీ నాయకులు హ్యాపీ కానీ జగన్ కి తమ్ముడి ధోరణి నచ్చడం లేదట. ఇంత సాఫ్ట్ మనిషి రాజకీయాలకు పనికిరాడని అంటున్నాడట. అవినాష్ మెతకదనం వల్లే కడపలో వైసీపీ దెబ్బ తింటోందని జగన్ ఫీలింగ్ అంట. అందుకే ఈసారి అవినాష్ ని పక్కనబెట్టి షర్మిల లేదా వివేకాకు కడప ఎంపీ టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారట.

ఎక్కడైనా రాజకీయాల్లో మంచివాడు దొరికితే బాగుండని పార్టీలు వెదుకుతుంటాయి. కానీ జగన్ మాత్రం మంచితనం రాజకీయాలకు మైనస్ అనుకుంటున్నారు. ఇదేనేమో కాల మహిమ.కలికాలం మహిమ. ఈ విషయం తెలిసిన వాళ్ళు జగన్ వైఖరి చూసి నవ్వుకుంటున్నారు.