‘జైలవకుశ’ పబ్లిక్‌, ఫ్యాన్స్‌ టాక్‌…

Jai Lava Kusa Genuine Public Talk

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో నటించిన ‘జైలవకుశ’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘జనతాగ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా అవ్వడంతో పాటు, మూడు పాత్రలు పోషిస్తున్నాడు అనే వార్తలు మొదటి నుండే వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్‌ భారీ ఆశలే పెట్టుకున్నారు. అంచనాలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో దర్శకుడు బాబీ ఆ అంచనాలను అందుకుంటాడా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించి మెప్పించాడు.

ఈ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి, వస్తున్నాయి. ఇక సినిమాను చూసిన ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్‌ ఫుల్‌ ఫిదా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ముఖ్యంగా అభిమానులు ఎన్టీఆర్‌ నటనకు దాసోహం అంటున్నారు. మా ఎన్టీఆర్‌కు మాత్రమే ఇలాంటి సినిమాలు సాధ్యం, ఎన్టీఆర్‌ అయితేనే ఇలాంటి సినిమాలు చేస్తాడు అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్‌కు జాతీయ అవార్డు అక్కర్లేదు, కాని ఈసినిమా తర్వాత జాతీయ అవార్డుకే ఎన్టీఆర్‌ కావాలి అంటూ సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ప్రేక్షకులు కూడా సినిమాను ఎంజాయ్‌ చేశాం అంటున్నారు. కథ కాస్త రొటీన్‌గా ఉన్నా కూడా ఎన్టీఆర్‌ చరిష్మాతో, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమాను పీక్స్‌కు తీసుకు వెళ్లారు అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్‌ మరోసారి ఫ్యాన్స్‌ను మరియు ప్రేక్షకులను కూడా మెప్పించాడు.