నేతలే కాదు.. అనుచరులూ తేడానే

ఏపీలో ఇసుక లెక్కేంటి..? ఏపీ తీవ్రమైన ఆర్థిక లోటును ఎదుర్కుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ఏ లోటూ రానీయడం లేదు. ఏపీ ఇంత బలహీనంగా ఉన్నా రాష్ట్రం గురించి మాట్లాడటానికి చంద్రబాబే కారణమని చాలా మంది నేతలు చెబుతున్నారు. అత్యుత్తమ పాలన అందిస్తున్న చంద్రబాబు.. ఇసుక విషయంలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న విధానం అందుబాటులోకి తెచ్చారు. ఫ్రీ ఇసుక పాలసీతో.. ఇసుక మాఫఇయాను అణగదొక్కాలని భావించారు. కానీ అధికారుల అలసత్వంతో ఆయన ఆశయాలకు తూట్లు పడ్డాయి. గతంలో మాదిరిగా కాకపోయినా.. అక్కడక్కడా ఇసుక మాఫియా తలెగరేస్తూనే ఉంది. ఎర్రచందనం మాఫియాను కఠినంగా అమలుచేసిన తరహాలోనే.. ఇసుక మాఫియా పని పట్టాలని ఏకంగా క్యాబినెట్ మీటింగులో బాబు ఆదేశాలిచ్చారు. టాడా కేసులు పెట్టాలన్న ఆదేశాలతో మాఫియా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చంద్రబాబు సీరియస్ అయ్యారంటే పనైపోయినట్లేనని భయపడుతున్నారు. కేసులతో ఆగని సీఎం.. స్వయంగా తానే రీచుల్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తానని చెప్పడం మరింత చర్చనీయాంశమైంది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉండగా చంద్రబాబు చేసిన తనిఖీలు గుర్తొచ్చి అధికారులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. జనాల ముందే తమను ఉతికి ఆరేస్తారని భయపడుతున్నారు. అటు నేతలు కూడా చంద్రబాబు ఎవర్ని పట్టుకుంటారోనని వణికిపోతున్నారు. వారానికో రీచ్ ను చంద్రబాబు సర్ ప్రైజ్ విజిట్ చేసినా ఇసుక విధానం ఆశయాలు నెరవేరతాయని నిపుణులు చెబుతున్నారు.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారని వాళ్ల అనుచరులు చెప్పుకుంటారు. కానీ బొత్తిగా సెన్స్ లేకుండా మాట్లాడతారని నేతలంతా తిట్టుకుంటారు. అలాంటి జేసీ బ్రదర్స్ ఈ మధ్య కాలంలో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా తయారయ్యారు. ట్రావెల్స్ విషయంలో ప్రభాకర్ రెడ్డి, ఎయిర్ లైన్స్ విషయంలో దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రికి బీపీ తెప్పించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వారిని సైడ్ చేయాలని బాబు ఇప్పటికే డిసైడైనట్లు తెలుస్తోంది. కానీ నేతలే కాదు వారి అనుచరులు కూడా ఏకు మేకై కూర్చుకున్నారు.

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డికి.. అక్కడ ఉన్న జేసీ అనుచరులు తలనొప్పిగా తయారయ్యాయి. అసలే మంత్రి పదవి పోయి బాథలో ఉన్న పల్లెను జేసీ అనుచరులు కవ్విస్తున్నారు. పుట్టపర్తిలో ఎమ్మెల్యే అయిన పల్లెకు చెప్పకుండా జలసిరికి హారతి ప్రోగ్రామ్ చేశారు. మిమ్మల్ని ఎవరు చేయమన్నారని అడిగితే సమాధానం చెప్పలేదు. జేసీ అండతో రెచ్చిపోతే చూస్తూ ఉరుకునేది లేదని ఆయన అనుచరుడ్ని మాజీ మంత్రిగారు హెచ్చరించారు. దీంతో ఇప్పుడీ విషయం జిల్లా పార్టీలో హాట్ టాపిక్ అయింది.

చంద్రబాబు మాటకు కూడా విలువ ఇవ్వకుండా ప్రవర్తించే జేసీ బ్రదర్స్.. ఇప్పుడు తమ అనుచరుల్ని కూడా అలాగే వదిలేస్తున్నారని టీడీపీ క్యాడర్ మథనపడుతోంది. ముఖ్యమంత్రిపై అందరికీ నమ్మకం ఉందని, ఆయన తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కూడా సమయం చూసి దెబ్బకొట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి పల్లె, జేసీ అనుచరుడి మధ్య ఉన్న వివాదం ఎలా పరిష్కారం అవుతుందో.