బాబాయి ఇంకా సినిమా చూడలేదు

Jr NTR Clarifies On Balayya Saw The Film Jai Lava Kusa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్‌ మూడు పాత్రలు పోషించిన జైలవకుశ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఈ సినిమాను నిర్మించాడు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ మరియు టీజర్‌లు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. సినిమాపై ఆసక్తితో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ను అడిగి మరీ బాలకృష్ణ ఈ సినిమా ప్రత్యేక షో చూశాడని, ఎన్టీఆర్‌ నటనకు బాలయ్య ఫిదా అయ్యాడు అంటూ సోషల్‌ మీడియాలో నిన్నటి నుండి తెగ ప్రచారం జరుగుతుంది. ఆ విషయంపై ఎన్టీఆర్‌ క్లారిటీ ఇచ్చాడు, పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు.

బాలయ్య సినిమా చూశాడు అంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎన్టీఆర్‌ స్పందిస్తూ… బాబాయి ఇంకా మా సినిమాను చూడలేదు, సినిమా థియేటర్లకు వచ్చిన తర్వాత చూస్తాడనుకుంటా, తప్పకుండా ఇది అందరికి నచ్చుతుంది, బాబాయి తప్పకుండా ఈ సినిమా చూస్తాడని, చూడాలని కోరుకుంటున్నా అంటూ ఎన్టీఆర్‌ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఎన్టీఆర్‌, బాయ్యలకు మద్య విభేదాలున్న సంగతి ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఈ నేపథ్యంలో బాబాయి బాలయ్య ఈ సినిమాను చూస్తాడని ఏ ఒక్కరు అనుకోరు. ఒకవేళ చూసినా కూడా మీడియా ముందుకు వచ్చి స్పందిస్తాడని కూడా భావించడం లేదు.