‘జైలవకుశ’ మొదటి రోజు కలెక్షన్స్‌

Jr.NTR Jai Lava Kusa First Collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్‌ జైలవకుశ చిత్రంకు ప్రేక్షకుల నుండి పాజిటివ్‌టాక్‌ వస్తుంది. మూడు విభిన్న పాత్రల్లో ఎన్టీఆర్‌ నటించడంతో అంచనాలు తారా స్థాయికి వెళ్లాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉండటంతో కలెక్షన్స్‌ భారీగా వస్తున్నారు. మొదటి నుండి కూడా మొదటి రోజు కలెక్షన్స్‌ 25 నుండి 30 కోట్లు ఉంటాయిన అంతా భావించారు. అనుకున్నట్లుగానే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 26.4 కోట్లు వసూళ్లు చేసినట్లుగా ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఇది బెస్ట్‌ ఓపెనింగ్‌గా చెప్పుకోవచ్చు.

ఏరియాల వారిగా ఈ చిత్రం సాధించిన కలెక్షన్స్‌ :
నైజాం : 5.05 కోట్లు,
సీడెడ్‌ : 4.28 కోట్లు,
వైజాగ్‌ : 1.89 కోట్లు,
ఈస్ట్‌ : 2.96 కోట్లు,
వెస్ట్‌ : 1.9 కోట్లు,
నెల్లూరు : 1.08 కోట్లు,
గుంటూరు : 3.05 కోట్లు,
కృష్ణ : 1.7 కోట్లు,
ఓవర్సీస్‌ : 3.5 కోట్లు,
ఇతరం : 1.5 కోట్లు
లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం సునాయాసంగా 100 కోట్ల షేర్‌ను సాధిస్తుందనే నమ్మకంతో ట్రేడ్‌ వర్గాల వారు ఉన్నారు.