లవకుమార్‌ ప్రకటన వచ్చింది

Jr-NTR-Lava-Kumar-First-Loo

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై లవకుశ’ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుకుంటుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి జై పాత్ర టీజర్‌ విడుదలైంది. జై టీజర్‌కు అనూహ్యంగా భారీ రెస్పాన్స్‌ వచ్చింది. కోటి వ్యూస్‌ అతి తక్కువ సమయంలోనే రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో వెళ్లడవుతుంది. జై టీజర్‌ తర్వాత లవకుమార్‌ టీజర్‌ కోసం ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

లవకుమార్‌ ఫస్ట్‌లుక్‌ ఇటీవలే విడుదలైంది. లవకుమార్‌ పాత్ర అంధుడు అని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది. రేపు ఆ విషయంపై క్లారిటీ రాబోతుంది. వినాయక చవితి సందర్బంగా లవకుమార్‌  టీజర్‌ను రేపు అంటే ఆగస్టు 24న సాయంత్రం 5.40 గంటలకు విడుదల చేయబోతున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యులు జై టీజర్‌ కంటే లవకుమార్‌ టీజర్‌ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుందని, తప్పకుండా సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఒక హీరో అందుడిగా కనిపించడం తెలుగు సినిమాలో చాలా అరుదు. మరి ఎన్టీఆర్‌ చేస్తున్న ప్రయోగం ఏ మేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.

మరిన్ని వార్తలు:

‘సైరా నరసింహారెడ్డి’కి ఇవి పెద్ద ప్లస్‌

మెగా ఫ్యామిలీతో రాజమౌళికి విబేధాలు లేవు