మహానటికి నాకు సంబంధం లేదు

junior-ntr-gives-clarity-on-savitri-bio-pic-mahanati-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మహానటి సావిత్రి జీవిత కథాంశంతో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మిస్తున్న చిత్రం ‘మహానటి’. ఈ చిత్రంలో మహానటి పాత్రను కీర్తి సురేష్‌ పోషిస్తుండగా, సమంత, దుల్కర్‌ సల్మాన్‌, షాలిని పాండేలు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఇక సావిత్రి జీవిత చరిత్రలో ఖచ్చితంగా ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లు ఉండాల్సిందే. వారి పాత్రల్లో వారి మనవల్లు అయిన నాగచైతన్య మరియు ఎన్టీఆర్‌లను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ఆ మద్య మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్‌ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.

ఎన్టీఆర్‌ నటించిన ‘జైలవకుశ’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఎన్టీఆర్‌ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ మహానటిపై స్పందించారు. తను మహానటి చిత్రంలో నటించాల్సిందా ఎవరు సంప్రదించలేదని, తన వద్దకు అలాంటి ఒప్పందం ఏమీ రాలేదని, వచ్చి ఉంటే ఎలా స్పందించేవాడినో అన్నాడు. ఖచ్చితంగా తాతగారి పాత్రను చేయడం అంటే సాహసమే. కాని అది నాకు సంతోషాన్ని ఇస్తుందని ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ మాటలు చూస్తుంటే ‘మహానటి’లో వీలు కాలేదు కాని, భవిష్యత్తులో తాతయ్య పాత్రను ఎన్టీఆర్‌ పోషిస్తాడేమో అనిపిస్తుంది.