కో…కో…కోటివ్యూస్‌

junior-ntr-jai-lava-kusa-trailer-record-in-24-hours

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జై ల‌వ‌కుశ ట్రైల‌ర్ మ‌రో రికార్డు సృష్టించింది. కో…కో…కోటి వ్యూస్‌ను దాటేసింది. అతి త‌క్కువ స‌మ‌యంలో జైల‌వ‌కుశ ట్రైల‌ర్ కోటి డిజిట‌ల్ వ్యూస్ సొంతం చేసుకుంద‌ని చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ తెలిపింది. బాహుబ‌లి త‌ర్వాత ఇంత వేగంగా ఇన్ని వ్యూస్ సాధించిన ట్రైల‌ర్ జై ల‌వ‌కుశ‌నే.

ఆదివారం విడుద‌లైన ట్రైల‌ర్ 24 గంట‌ల్లో 70, 54,000 వ్యూస్ సాధించగా… మ‌రో 24 గంట‌లు గ‌డ‌వ‌క‌ముందే…కోటి వ్యూస్ ను దాటేసింది. ఘ‌ట్ట‌మేదైనా..పాత్రేదైనా..నేను..రె..రె..రెడీ అంటూ న‌త్తితో జై పాత్ర‌ధారిగా ఎన్టీఆర్ ప‌లుకుతున్న డైలాగ్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.

నిర్మాణం ద‌శ‌నుంచే భారీ హైప్ క్రియేట్ చేసిన జై ల‌వ‌కుశ ట్రైల‌ర్ విడుద‌ల త‌ర్వాత మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. ఈ నెల 21న ద‌స‌రా కానుక‌గా సినిమా ప్రేక్ష‌కుల ముదుకు రానుంది. ఎన్టీఆర్ అభిమానులు ఆ రోజు కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు:

జైలవ‌కుశ ట్రైల‌ర్ కు భారీ రెస్పాన్స్

ఎన్టీఆర్‌ను చూసి లక్ష్మీ ప్రణతి భయపడిన సందర్బం

మహేష్‌తో ఎన్టీఆర్‌ ఢీ.. నిలిచేనా?