సరైన సమయంలో సరైన అవార్డు

KCR Awarded Agricultural Leader

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 KCR Awarded Agricultural Leader

తెలంగాణ సీఎం కేసీఆర్, భారత్ మాజీ కెప్టెన్ ధోనీకి చాలా పోలికలు కనిపిస్తాయి. ధోనీకి కూడా కెరీర్లో చాలా సార్లు అనుకున్న సమయానికి అనుకున్న ఘనతలు వచ్చేసాయి. అదీ పెద్దగా కష్టపడకుండా, జస్ట్ ప్రయత్నం చేయగానే అంత ఈజీనా అన్నంతగా వచ్చేశాయి. ఇప్పుడు కేసీఆర్ కు అలాగే ఉంది. ఆయన అనుకున్న సమయానికి అనుకున్న ఘనతలు కష్టపడకుండానే వచ్చి పడుతున్నాయి.

కేసీఆర్ కు వ్యవసాయ నాయకత్వ అవార్డు రావడంపై టీఆర్ఎస్ పండగ చేసుకుంటోంది. రైతులకు వచ్చే ఖరీఫ్ నుంచి పెట్టుబడి రాయితీ ప్రకటించిన తరుణంలో.. ఈ అవార్డు రావడం తమకు అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు కేసీఆర్ ను తప్పుబడుతున్న సమయంలో.. వ్యవసాయ నాయకత్వ అవార్డు రావడంతో.. వారి నోటికి తాళం పడ్డట్లేనంటున్నాయి గులాబీ శ్రేణులు.

వ్యవసాయం విషయంలో కేసీఆర్ మొదట్నుంచీ రైతు. ఏకంగా ఎకరాకు కోటి రూపాయల ఆదాయం సంపాదించి రైతులకే పాఠాలు చెప్పారు. ఇప్పుడు అదే కేసీఆర్ సీఎంగా రైతుల కోసం వినూత్న పథకాలు ప్రవేశపెడుతున్నారు. మిషన్ కాకతీయతో చెరువుల కింద పొలాలకు మేలు చేశారు. 24 గంటల విద్యుత్ తో రైతుల నెత్తిన పాలు పోశారు. ఇప్పుడు పెట్టుబడి రాయితీ కూడా ఇచ్చేస్తే.. ఇక కేసీఆర్ మిగతా సీఎంలకు అందనంత దూరంలో ఉంటారు.