‘ఖాకి’ ప్రివ్యూ…

khakee Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   కార్తి, రకుల్  ప్రీత్  సింగ్ 

నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
దర్శకత్వం :
వినోత్
సినిమాటోగ్రఫీ: సత్యాన్ సూర్యాన్
ఎడిటర్ : శివనందీశ్వరన్
మ్యూజిక్ : జిబ్రాన్ 

తమిళ స్టార్‌ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ ఉంది. ఆయన తమ్ముడు కార్తి తమిళ సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి తెలుగులో కూడా అన్న కారణంగా గుర్తింపు దక్కించుకున్నాడు. తెలుగులో కార్తి నటించిన పలు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ కారణంగా ఆయన నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులో విడుదల అవుతుంది. తెలుగు ప్రేక్షకులు కార్తీని తెలుగు హీరోగానే భావిస్తారు. తెలుగులో ‘ఊపిరి’ చిత్రంలో కార్తీ నటించిన విషయం తెల్సిందే. కార్తీ ఏ సినిమాలో నటించినా కూడా తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. తాజాగా కార్తీ తమిళంలో ఒక చిత్రాన్ని చేశాడు. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఆ సినిమాను తెలుగులో ‘ఖాకి’ పేరుతో విడుదల చేస్తున్నారు.

రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఖాకి’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. కార్తీకి జోడీగా ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన కారణంగా తెలుగు సినిమా అనే అంతా భావిస్తున్నారు. తెలుగులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టార్‌ హీరోయిన్‌. ఆమె కారణంగా కూడా తెలుగు ఆడియన్స్‌ ఈ సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. పోలీస్‌ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ మరియు ట్రైలర్‌ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్‌ విడుదల తర్వాత సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. సినిమాకు భారీ పబ్లిసిటీ చేసిన కారణంగా సినిమా ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు.