మోడ్ర‌న్ కాస్ట్యూమ్స్ లో గాంధీజీ మునిమ‌న‌వ‌రాలు

mahatma gandhi great granddaughter medha hot photos

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మ‌న జాతిపిత మ‌హాత్మాగాంధీ ఎంతో నిరాడంబ‌రంగా జీవించేవారు. ఆయ‌న జీవించే కాలం నాటికే ఫ్యాష‌న్ ట్రెండ్స్ అమ‌ల్లో ఉన్నాయి కానీ… త‌న జీవితంలో ఏనాడూ ఆయ‌న వాటి జోలికి పోలేదు. దుస్తుల‌పై, అలంక‌ర‌ణ‌పై మ‌నిషి వ్యామోహాన్ని వదులుకోవాల‌ని గాంధీజీ సూచించేవారు.  ఫొటోల్లోను, విగ్ర‌హాల్లోనూ గాంధీజీ ఆహార్యం చూస్తే… ఆయ‌న ఎంత నిరాడంబ‌ర వ్య‌క్తో అర్ధ‌మ‌వుతోంది. అయితే ఆయ‌న్ను జాతిపిత అని చెప్పుకుంటున్నాము కానీ… ఈ త‌రం వాళ్లెవ‌రూ  ఆయ‌న జీవించిన ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రించ‌టం లేదు. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ దుస్తుల విష‌యంలో ఫ్యాష‌న్ ట్రెండ్స్ ను ఫాలో అవుతున్నారు.

గాంధీజీ మునిమ‌న‌వ‌రాలూ ఇందుకు మిన‌హాయింపు కాదు. అమెరికాలో పుట్టిపెరిగిన గాంధీజీ మునిమ‌న‌వరాలు మేధాగాంధీ ఫొటోలు కొన్ని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈమె  మోడ‌ల్ కాదు… గాంధీజీ మునిమ‌న‌వ‌రాలు అంటూ అనేక‌మంది ఈ ఫొటోలు షేర్ చేస్తున్నారు. అమెరికా లైఫ్ స్ట‌యిల్ కు త‌గ్గ‌ట్టుగా మేధాగాంధీ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. గాంధీజీ కుటుంబ స‌భ్యురాలు ఇలా ఉండ‌టంపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. గాంధీజీ కుటుంబ స‌భ్యులెవ్వ‌రూ ఆయ‌న ఆచ‌రించిన నియ‌మాల‌ను పాటించ‌టం లేదంటున్నారు. మేధా గాంధీ తండ్రి పేరు కాంతీలాల్ గాంధీ. ఆయ‌న గాంధీ మ‌న‌వ‌డు. 1948లో గాంధీజీ హ‌త్య‌కు గుర‌యిన త‌ర్వాత ఆయ‌న కుటుంబ స‌భ్యులు కొంద‌రు అమెరికాలో స్థిర‌ప‌డ్డారు. వారిలో కాంతీలాల్ గాంధీ తండ్రి ఒక‌రు. ద‌శాబ్దాలుగా వారి కుటుంబం అమెరికాలోనే ఉంటోంది. మేధా గాంధీ అక్క‌డే పుట్టి పెర‌గ‌డంతో ఆ సంస్కృతినే అల‌వ‌ర్చుకున్నారు.

ప్ర‌స్తుతం ఆమె అమెరికాలో డీజేగా ప‌నిచేస్తున్నారు. కొన్ని షోలు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల ఆమె త‌న స్నేహితుల‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ ఛేశారు. అవే ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. అయితే కొంద‌రు నెటిజ‌న్లు మేధాకు స‌పోర్ట్ చేయ‌క‌పోయినా అంత వ్య‌తిరేక‌త‌నూ క‌న‌బ‌ర్చ‌టం లేదు. ద‌శాబ్దాల క్రితం అమెరికాలో స్థిర‌ప‌డ్డ భార‌తీయుల పిల్ల‌లు అనేక‌మంది అమెరికా వేష‌భాష‌ల‌ను, సంస్కృతినే అల‌వ‌ర్చుకుంటున్నార‌ని, మేధాగాంధీ కూడా అలాంటి వారిలో ఒక‌ర‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తానికి దేశ‌ప్ర‌జ‌ల‌కు గాంధీజీ కుటుంబ‌స‌భ్యురాలొక‌రు ఈ రూపంలో ప‌రిచ‌య‌మ‌య్యారు.

గాంధీ న‌లుగురు కొడుకుల పిల్ల‌లంతా ఎక్క‌డ ఉంటున్నారు… ఏమి చేస్తున్నారు అన్న‌వివ‌రాలు జాతీయ మీడియాకు కూడా స‌రిగ్గా తెలియ‌వు. ఆయ‌న మ‌న‌వ‌డు గోపాల కృష్ణ గాంధీ ఒక్క‌రే ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ఉన్నారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం వెంక‌య్య‌నాయుడితో పోటీచేసి ఓడిపోయిన గోపాల‌కృష్ణ గాంధీ పేరు ఒక్క‌టే అప్పుడ‌ప్పుడు వార్త‌లో క‌నిపిస్తుంటుంది. దేశ‌స్వాతంత్ర్యం కోసం జీవితాన్ని వెచ్చించిన గాంధీజీ వార‌సులెవ‌రూ ఇప్పుడు రాజ‌కీయాల్లో ప‌ద‌వులు అనుభ‌వించ‌టం లేదు. గాంధీజీ రాజ‌కీయ జీవితం, వార‌స‌త్వం ఆయ‌న‌తోటే ముగిసిపోయాయి.

మరిన్ని వార్తలు:

మూడుసార్లు త‌లాక్ కు… సుప్రీంకోర్టు త‌లాక్‌

భార‌త్ పై ప్రేమ‌, పాక్ పై కోపం

సాక్షిలో కోవర్టులెవరు జగన్..?