మహేషు.. కాస్త దూకుడు తగ్గించుకో నాయనా..!

Mahesh Kathi Responds over Jr NTR Counter on Film Critics
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బిగ్‌బాస్‌ సీజన్‌ 1లో నాలుగు వారాల పాటు ఉండి తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని గుర్తింపును కత్తి మహేష్‌ దక్కించుకున్నాడు. బిగ్‌బాస్‌కు ముందు కత్తి మహేష్‌ అంటే సాదారణ ప్రేక్షకులకు కాదుకదా, సినీ వర్గాల్లో కూడా పెద్దగా పరిచయం లేదు. కాని బిగ్‌బాస్‌ తర్వాత కత్తి మహేష్‌ గురించి అంతా మాట్లాడుకున్నారు. కత్తి మహేష్‌ ఒక రివ్యూ రైటర్‌, ఆయన ఒక సినీ విశ్లేషకుడు, విమర్శకుడు అని తెలుసుకున్నారు. తనకు వచ్చిన పబ్లిసిటీని మరింతగా పెంచుకునేందుకు కత్తి మహేష్‌ అప్పటి నుండి కూడా తెగ మీడియాలో కనిపించేందుకు ఆసక్తిని చూపుతున్నాడు. ఏదైనా పెద్ద విషయాన్ని పట్టుకుంటేనే మంచి పబ్లిసిటీ వస్తుందని కత్తి మహేష్‌కు తెలుసు. అందుకే కాస్త రిస్క్‌ అయినా కూడా పవన్‌ కళ్యాణ్‌ ఇష్యూను నెత్తికి ఎత్తుకున్నాడు. పవన్‌కు నటన రాదని, రాజకీయాల్లో ఆయన పనికిరాడు అంటూ తేల్చేశాడు. అప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌ వ్యవహరించిన తీరు మామూలుగా లేదు.

పవన్‌ ఫ్యాన్స్‌ నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న కత్తి మహేష్‌ తాజాగా ఎన్టీఆర్‌తో పెట్టుకునే ప్రయత్నం చేశాడు. ‘బిగ్‌బాస్‌’లో ఉన్న సమయంలో కత్తి మహేష్‌కు ఎన్టీఆర్‌ మంచి మద్దతుగా నిలిచారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఒకటి రెండు సార్లు కత్తి మహేష్‌ గురించి ఎన్టీఆర్‌ మాట్లాడటం జరిగింది. అలాంటి ఎన్టీఆర్‌పై కత్తి మహేష్‌ చాలా గౌరవంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆయన వృతి విమర్శలు చేయడం అయినా కూడా ఎన్టీఆర్‌ విషయంలో మాత్రం కత్తి మహేష్‌ కాస్త చూసి చూడనట్లుగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాన కత్తి మహేష్‌ మాత్రం అలా చేయకుండా అంతా నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ‘జైలవకుశ’ సక్సెస్‌ మీట్‌లో రివ్యూలు రాసిన వారిపై ఎన్టీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

సినిమా చూసేది ప్రేక్షకులు, వారు సినిమాను చూసి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి, కాని దారిన పోయే వాడు ఎవడో సినిమా గురించి కామెంట్స్‌ చేయడం ఏంటని రివ్యూలు రాసే వారిపై ఎన్టీఆర్‌ చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రివ్యూల వల్ల సినిమా దెబ్బ తింటుందనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్‌ అలాంటి వ్యాఖ్యలు చేశాడు అనే విషయం అందరికి తెలుసు. కాని ఆ వ్యాఖ్యలను కత్తి మహేష్‌ తప్పుబట్టాడు. రివ్యూవర్స్‌పై ఎన్టీఆర్‌ విమర్శలు చేయడాన్ని కత్తి మహేష్‌ తప్పుబట్టాడు. ప్రేక్షకుడు సినిమాను ఎంజాయ్‌ మాత్రమే చేస్తాడు, కాని విమర్శకుడు సినిమాను విశ్లేషిస్తాడు, దానిలోని లోపాలను చూపే ప్రయత్నం చేస్తాడు. ప్రతి ఒక్కరికి వాక్‌ స్వతంత్య్రం ఉంటుంది. ఎన్టీఆర్‌ అలాంటి మాటు మాట్లాడి మాలాంటి వారికి పబ్లిసిటీ పెంచవద్దని కత్తి మహేష్‌ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ను ఎదిరించి కత్తి మహేష్‌ మాట్లాడటంపై నందమూరి ఫ్యాన్స్‌ ఆగ్రహంతో ఉన్నారు. దూకుడు తగ్గించుకోకుంటే ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.