ఇంకో ఎన్టీఆర్, ఒక లక్ష్మీపార్వతి బయటికి వచ్చారు.

Mahesh Manjrekar And Pooja Kumar Plays NTR And Lakshmi Parvathi Roles

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగులో సినీ రంగంలో ఇప్పుడు సెంట్రల్ పాయింట్ ఎన్టీఆర్ మీద తీస్తున్న సినిమాలే. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన కథతో ఒకేసారి మూడు సినిమాలు వస్తున్నాయి. బాలయ్య, తేజ కాంబినేషన్లో వస్తున్న ఎన్టీఆర్ సినిమాలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పాత్ర బాలయ్య చేస్తాడు అన్నది అందరికీ తెలిసిందే. వర్మ చేస్తున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ లో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి పాత్రలు ఏ నటులు వేస్తారు అన్నది ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఇప్పటికే ఆ రెండు పాత్రలకు ఇద్దరు కొత్త నటీనటులను ఎంపిక చేసిన వర్మ వారికి రహస్యంగా శిక్షణ ఇస్తున్నట్టు టాక్. వర్మ బయటికి చెప్పేదాకా ఆ ఇద్దరి వివరాలు బయటకు రావడం కష్టమే.

RGV-counter-to-Lakshmi's-Ve

ఇక “లక్ష్మీస్ వీరగ్రంధం “ విషయానికి వచ్చేసరికి లక్ష్మీపార్వతి పాత్రకు ముందుగా వాణివిశ్వనాధ్ పేరు… ఆ తర్వాత లక్ష్మి రాయ్ పేరు వినిపించాయి. కానీ ఆ ఇద్దరితో దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సంప్రదింపులు జరపలేదు. ఆయన ఆ పాత్రలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. లక్ష్మీపార్వతి పాత్రలో ఈ మధ్య గరుడ వేగ లో రాజశేఖర్ భార్య పాత్ర వేసిన నటి పూజ కుమార్ ని సెలెక్ట్ చేశారు. ఎన్టీఆర్ పాత్ర కి బాలీవుడ్ సీనియర్ నటుడు మహేష్ మంజ్రేకర్ ని అనుకుంటున్నట్టు కేతిరెడ్డి వెల్లడించారు. దీంతో ఇంకో ఎన్టీఆర్, ఒక లక్ష్మీపార్వతి ఎవరో తేలిపోయింది. రాము కొత్తవాళ్లతో ప్రయోగం చేస్తుంటే కేతిరెడ్డి మాత్రం బాగా నలిగిన మొహాలని తీసుకుంటున్నాడు. విలన్ వేషాలు వేసిన మహేష్ మంజ్రేకర్ ప్రతిభ మీద ఎవరికీ సందేహాలు లేకపోయినా తెలుగు వాళ్ళు ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ని పరభాషా నటుడుడైన మహేష్ మంజ్రేకర్ ఏ మాత్రం పట్టగలడో చూడాలి.