వివేకానందుడితో దీదీ రాజకీయాలు

Mamatha Benjarji Politics With Vivekananda

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్న ఒక్క సంబోధన ప్రపంచ చరిత్రను తిరగరాసింది. పూర్వం శంకరాచార్యుడు భారతీయ ధర్మాన్ని శిఖరాగ్రాన నిలిపితే.. ఆ తర్వాత మన కాలంలో వివేకానందుకు దాన్ని మరోసారి పతాకస్థాయిలో నిలబెట్టాడు. అప్పటిదాకా ఇండియా సన్యాసులంటే చులకనగా చూసిన అమెరికన్లు.. స్వామీజీలను గౌరవించడం మొదలుపెట్టారు. హిందూ మతాన్ని అనుసరించడం నేర్చుకున్నారు. అలాంటి వివేకానందుడి చికాగో ప్రసంగానికి 124 ఏళ్లు పూర్తయ్యాయి.

వివేకానందుడికి రాజకీయాలకు సంబంధం లేదు. ఆయన యువత అందరికీ స్ఫూర్తిప్రదాత. కుల, మతాలకు అతీతంగా వివేకానందుడ్ని యూత్ అభిమానిస్తున్నారు. కానీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మాత్రం వివేకానందుడు చేదైపోయాడు. వివేకానందుడి స్ఫూర్తితో ఆయన చికాగో ప్రసంగం చేసిన సెప్టెంబర్ 15న జాతి నుద్దేశించి ప్రసంగించాలని ప్రధాని భావించారు. ఆయన స్పీచ్ ప్రత్యక్ష ప్రసారం చేయాలని యూజీసీ కాలేజీలు, స్కూళ్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో మరే స్కూల్ నుంచీ అబ్జెక్షన్ రాకపోయినా.. బెంగాల్ లో మాత్రం అభ్యంతరం చెప్పారు.

iయూజీసీ మార్గదర్శకాలు అమలు చేయాలా.. వద్దా అని బెంగాల్ సర్కారును అక్కడి కాలేజీలు అడిగాయి. సహజంగా యూజీసీ రూల్స్ కాలేజీలు పాటిస్తాయి. కాకపోతే ఇది రాజకీయం కాబట్టి అడిగాయి. దీనికి తగ్గట్లుగా మమత సర్కారు కూడా యూజీసీ చెప్పింది పాటించాల్సిన పనిలేదని తేల్చింది. నిజానికి వివేకానందుడు బెంగాలీనే. మోడీపై కోపంతో.. సొంత రాష్ట్రం వాడ్ని కూడా అవమానించే విధంగా మమత నడుచుకుంటున్నారని బెంగాలీ చరిత్రకారులు మండిపడుతున్నారు. ఎవరేమనుకున్నా నేనింతే అంటున్నారు దీదీ.

మరిన్ని వార్తలు:

బాలుడి హ‌త్య‌ కేసుః నిందితుడి అరెస్ట్

సెప్టెంబ‌రు 9 స‌చిన్ కు ఎంతో ప్ర‌త్యేకం