పురుషుడు ఇలా ఉండాలని ధర్మం చెప్పింది …

Man will Follow This Rules In Our Life Then We will be success

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కార్యేషు యోగీ, కరణేషు దక్షః

రూపేచ కృష్ణః క్షమయా తు రామః|

భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం

షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః||

(కామందక నీతిశాస్త్రం)

కార్యేషు యోగీ
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.

కరణేషు దక్షః
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.

రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. ఇక్కడ రూపం అంటే… బాహ్య రూపం కాదు. మానసికంగా ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.

క్షమయా తు రామః
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.

భోజ్యేషు తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.

సుఖదుఃఖ మిత్రం
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

ఈ షట్కర్మలు – (ఈ ఆరు పనులు) సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.

 మరిన్ని వార్తలు:

కష్టజీవి శ్రీకృష్ణుడు …

మోడీ,షా కి ఓటమి రుచి చూపిన గుజరాత్.

పవన్ కళ్యాణ్ కి ఆ సర్వే భగవద్గీత అయ్యిందా ?