మిడిల్ క్లాస్ అబ్బాయి ఫస్ట్ లుక్…

Nani MCA Movie First Look

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మూడు నెల‌ల‌కో సినిమా విడుద‌ల చేస్తూ ఎప్పుడూ బిజీబిజీగా ఉంటున్న నాని… దీపావ‌ళి సంద‌ర్బంగా త‌న తాజా చిత్రం ఎంసీఏ ఫ‌స్ట్ లుక్ ట్విట్ట‌ర్ లో విడుద‌ల‌చేశారు. ఎంసీఏ అంటే అర్ధం మిడిల్ క్లాస్ అబ్బాయి. ఫ‌స్ట్ లుక్ లో నాని అచ్చంగా… మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడిని త‌ల‌పిస్తున్నారు. లుంగీ క‌ట్టుకుని చేతిలో రెండు పాల‌ప్యాకెట్లు ప‌ట్టుకుని చిరునవ్వు చిందిస్తూ న‌డిచి వెళ్తున్న‌ట్టుగా ఉన్న ఎంసీఏ ఫ‌స్ట్ లుక్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అందిరికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు… మీ మిడిల్ క్లాస్ అబ్బాయి ఫ‌స్ట్ లుక్ ఇదుగో అని నాని ట్వీట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొస్తోంది. ఇదే స‌మ‌యంలో ఆయ‌న కృష్ణార్జున యుద్దం లో కూడా న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాల త‌ర్వాత నాని న‌టించ‌బోయే త‌ర్వాత సినిమా కూడా ఫిక్స్ అయింది.

ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌లతో నాని ఓ సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాకు చిత్ర‌ల‌హ‌రి అనే టైటిల్ ఖ‌రారు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్రైవేట్ శాటిలైట్ ఛానల్స్ లేని రోజుల్లో దూర‌ద‌ర్శ‌న్ లో వారానికోసారి చిత్ర‌ల‌హ‌రి పేరుతో అరగంట పాటు వ‌చ్చే పాట‌ల‌కు విప‌రీత‌మైన ప్ర‌జాద‌ర‌ణ ఉండేది. చిత్ర‌ల‌హ‌రి కోసం చిన్నా పెద్దా టీవీల వ‌ద్ద‌కు ప‌రుగుతీసేవారు..అందుకే చిత్ర‌ల‌హ‌రి అన‌గానే…అంద‌రికీ దూర‌ద‌ర్శ‌న్ కార్య‌క్ర‌మ‌మే గుర్తుకొస్తోంది. మ‌రి నాని సినిమాకు, ఆ కార్య‌క్ర‌మానికి ఏమ‌న్నా సంబంధ‌ముందా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది. జ‌న‌వరి లేదా ఫిబ్ర‌వ‌రిలో సినిమా షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది.

Nani MCA First Look